హైదరాబాద్‌లో ట్రాఫిక్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.. ఉదయం 8 గంటల నుండి వాహనాల రద్దీ మొదలౌతుంది.. ఇక రాత్రి 10 దైనా కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ లు అవుతూనే ఉంటాయి. అయితే కొందరు త్వరాగా ఆఫీసుకు వేళ్లాలనో..ఇంటికి వేళ్లాలనో.. ఓవర్ టేక్ చేయాలనో.. ట్రాఫిక్ లో అదేపనిగా హారన్ కోడుతూ ఉంటారు. దీంతో శబ్దకాలుష్యం విపరీతంగా పెరుగుతోంది.. అంతేకాదు కొన్ని సమయాల్లో ఈ హారన్ మోత వల్ల కొడవలు కూడా జరుతుండడం మనం చూస్తుంటాము.. అలాగే కొందరు అకతాయిలు.. హారన్ కొడుతూ ర్యాష్ డ్రైవింగ్ చేస్తుంటారు. దీనివల్ల తోటి ప్రయాణికలు ఇబ్బందులు కాలుగుతుంటాయి. అయితే ఈ శబ్ద కలుష్యాన్ని నివారించడం కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొత్త రూల్ తీసుకురాబోతున్నారు.
ఈ కొత్త రూల్ ప్రకారం అనవసరంగా హారన్ కొట్టే వారిని అడ్వాన్స్డ్ టెక్నాలజీ కెమెరాల సాయంతో పోలీసులు గుర్తించనున్నారు.అనవసర హారన్ మోతాదును బట్టి వాహనదారుడిపై చర్యలు తీసుకుంటారు.ఈ చర్యల కింద భారీ జరిమానాలు విధించడంతో పాటు ఏకంగా వాహనదారులను కోర్టులో హాజరుపరిచే దాకా శిక్షలు ఉన్నాయి.ఈ మేరకు మోటారు వాహనాల చట్టంలోని 119 సెక్షన్‌ను పకడ్బందీగా అమలు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు.ఈ కొత్త రూల్ జులై నుండి అమలుకానున్నట్టు నగర ట్రాఫిక్ పోలీస్ చీఫ్ ఏవీ రంగనాథ్ తెలిపారు.
