- ఉద్యోగాల ఆశచూపి మోసాలకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్ట్
ఓల్ఢ్సిటీ, వెలుగు: ఇన్‌స్టాగ్రామ్ డేటింగ్ యాప్ ద్వారా మహిళలకు ఎర వేసి, ఉద్యోగాల ఆశచూపి మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్ట్చేసినట్లు చాంద్రాయణగుట్ట ఏసీపీ సుధాకర్, మైలార్‌దేవ్‌పల్లి ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ తెలిపారు. మైలార్‌దేవ్‌పల్లి పరిధిలోని కట్టేదాన్ పద్మశాలీపురానికి చెందిన జెట్ల శ్రీవాణికి వారం రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్ ఈజ్ యాప్ ద్వారా ఏపీలోని విశాఖపట్నంకు చెందిన కుడుముల పాండురంగారావు అలియాస్ సన్నీ నాయుడుతో పరిచయం ఏర్పడింది.
తాను ఒక ఫిల్మ్ ప్రొడ్యూసర్ కొడుకునని, ఫైనాన్స్ వ్యాపారాలకు మేనేజింగ్ డైరెక్టర్ అని పరిచయం చేసుకున్నాడు. తమ కంపెనీలో మంచి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. ఆమె వద్ద రూ.7,500, మంగళసూత్రం తీసుకున్నాడు. తర్వాత స్పందించకపోవడంతో బాధితురాలు ఈ నెల 2న మైలార్‌దేవ్‌పల్లి ఠాణాలో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు పాండురంగారావుతోపాటు అతనికి సహకరించిన తమిళనాడు వేలూరు జిల్లా చెందిన పెరియన్నన్ అలియాస్ కుమార్ ను గురువారం అరెస్ట్చేశారు. రూ.70 వేలు, మంగళసూత్రం, కారును స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ పేర్కొన్నారు.
