ఏఐ కోసం 2వేల 888 జీపీయూలు.. రూ.25 వేల కోట్ల పెట్టుబడులకు ఉర్సా కంప్యూట్ రెడీ

ఏఐ కోసం 2వేల 888 జీపీయూలు..  రూ.25 వేల కోట్ల పెట్టుబడులకు ఉర్సా కంప్యూట్ రెడీ

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఇండియా ఏఐ మిషన్‌‌లో భాగంగా హైదరాబాద్‌‌కు చెందిన ఉర్సా కంప్యూట్ సంస్థ  దేశీయ  ఏఐ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి గ్రేటర్ నోయిడాలోని ఎస్టీ టెలిమీడియా గ్లోబల్ డేటా సెంటర్లో 2,888 ఎన్విడియా బ్లాక్‌‌వెల్ గ్రాఫిక్ ​ప్రాసెసింగ్ ​యూనిట్లను ( జీపీయూలు) అమర్చుతోంది. ఈ ప్రాజెక్టు విలువ రూ.25 వేల కోట్ల వరకు ఉంటుంది.  

నోయిడా, హైదరాబాద్, విశాఖపట్టణంలోనూ వీటిని నిర్మించనున్నారు. ఈ క్లౌడ్ ప్లాట్‌‌ఫారమ్ ద్వారా స్టార్టప్‌‌లు, పరిశోధకులు, విద్యాసంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు తమ  అవసరాలకు అనుగుణంగా ఎల్ఎమ్ఎమ్, ఎల్‌‌ఎల్ఎమ్‌‌లు, ఎస్ఎల్‌‌ఎమ్‌‌లు, ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేసుకోవచ్చు.