మాజీ లెజండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్.. తన కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఆడే మ్యాచ్ లను చూడనని అన్నారు. అర్జున్ ముంబై రంజీ జట్టులో భాగంగా ఉన్నాడు. అలాగే.. ఇటీవల ముగిసిన ఐపీఎల్ వేలంలో ముంబై ఇండియన్స్ జట్టు అతడ్ని రూ.25 లక్షలకు కొనుగోలు చేసింది.
పిల్లల మ్యాచ్ లను తల్లిదండ్రులు చూస్తుంటే వారు ఒత్తిడికి లోనవుతారని... అందుకే నేను అర్జున్ ఆడే మ్యాచ్ లకు వెళ్లి చూడాలని అనుకోవడం లేదు అని తెలిపాడు సచిన్. అతడు పూర్తి స్వేచ్ఛతో ఆడాలని.. క్రికెట్ ను ప్రేమించాలని నేను కోరుకుంటానని.. అతడు ఏం చేయాలనుకున్నాడో దానిపైనే దృష్టి పెట్టాలని అని అన్నాడు.
అతడు ఆటపైనే దృషి నిలపాలన్నసచిన్... తన కుటుంబ సభ్యులు నా మ్యాచ్ చూడడం నాకు కూడా ఇష్టం ఉండదన్నాడు. ఒకవేళ నేను అర్జున్ మ్యాచ్ లకు వెళ్లినా ఎక్కడో ఒక చోటు చాటుగా ఉండి చూస్తాను. నేను అక్కడ ఉన్నట్టు అతడికి కానీ, కోచ్ కానీ, మరొకరికి కానీ తెలియదు అని సచిన్ టెండూల్కర్ చెప్పాడు. అర్జున్ బ్యాట్ పట్టుకోవాలంటూ తాము ఒత్తిడి చేయలేదని స్పష్టం చేశారు.
మరిన్ని వార్తల కోసం..

