Mohammad Rizwan: టీ20 ప్రపంచ కప్ 2026లో పాకిస్థాన్ జట్టు సూపర్–-8 దశలోనే ఈ మెగా ఈవెంట్ నుంచి నిష్క్రమించింది. శ్రీలంకతో జరిగిన చివరి మ్యాచ్‌లో గెలిచినప్పటికీ, మెరుగైన రన్‌రేట్ లేని కారణంగా పాక్ సెమీస్‌కు అర్హత సాధించలేకపోయింది. ఈ ఘోర వైఫల్యంతో పాక్ జట్టుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్న పాక్ వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు అతడు సమాధానం ఇస్తూ.. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో భారీ తేడాతో గెలవాల్సి ఉండేది.. కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో భారీ తేడాతో కాకుండా.. ఉత్కంఠభరితంగా సాగినప్పటికీ మ్యాచ్ గెలిచాం.. అదే మాకు ముఖ్యమని చెప్పాడు.
భారత జట్టు ఆడుతున్న మ్యాచ్ ని చూడాలని సదరు జర్నలిస్ట్ సూచించాడు.. దీనికి పాక్ వికెట్ కీపర్ రిజ్వాన్ స్పందిస్తూ.. తాను టీమిండియా మ్యాచ్‌లు చూడనని చెప్పాడు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీశాయి. అతడ్ని నెట్టంట ఇండియన్స్ ఓ ఆట ఆడుకుంటున్నారు. ముందు మీకు గెలవడం చేతకాదు, అందుకే భారత్ పై విషం చిమ్ముతున్నారంటూ ఓ యూజర్ కామెంట్ చేయగా, ఇండియన్ క్రికెటర్స్ ఆడే విధానం చూసి నేర్చుకోవాలని జర్నలిస్ట్ సూచించాడు.. కానీ ఈ పాకీలకు అది చేతకాదు కాబట్టి టీమిండియా మ్యాచ్ లు చూడను అంటున్నాడు ఈ రిజ్వాన్ అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు
ALSO READ : భారత్–న్యూజిలాండ్ మధ్య వరల్డ్ కప్ ఫైనల్..
టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్ నుంచి జట్టు నిష్ర్కమించిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కఠిన చర్యలు చేపట్టింది. దీంతో ప్లేయర్స్ పై భారీగా జరిమానా విధించింది. 2027 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని కొత్త టీమ్ ని తయారు చేయాలనే ఆలోచనతో పీసీబీ ముందుకు సాగుతుంది. ఇందులో భాగంగానే యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో బంగ్లాదేశ్‌తో జరగనున్న సిరీస్ కోసం పలువురు సీనియర్ ఆటగాళ్లను తప్పించి.. ఆరుగురు కొత్త ప్లేయర్స్ ని తుది జట్టులోకి తీసుకుంది. ఈ వ్యూహాన్ని పాకిస్తాన్ బోర్డు ఎంతకాలం కొనసాగిస్తుందో వేచి చూడాలి.. గతంలో కూడా ప్రపంచకప్ నుంచి వైదొలగిన తర్వాత యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చి, ఆ తరువాత మళ్లీ సీనియర్స్ ని తుది జట్టులోకి తీసుకున్న సందర్భాలు ఉన్నాయి.
