నాకు ప్రపంచకప్‌ కావాలి: గంగూలీ

నాకు ప్రపంచకప్‌ కావాలి: గంగూలీ

ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో ఆడకపోతే భారత్‌కే నష్టమని, అనవసరంగా రెండు పాయింట్ల ఇవ్వడం తనకైతే ఇష్టంలేదని మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ అన్నారు. అయితే సచిన్ వ్యాక్యలపై స్పందించిన టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ..ఆయనకు కేవలం రెండు పాయింట్లు మాత్రమే కావాలని, కానీ తనకు భారత్‌ ప్రపంచకప్‌ గెలవడం కావాలన్నారు. 10 దేశాలు పాల్గొనే ఈ మెగాటోర్నీలో ప్రతీ దేశం.. ఇతర దేశాలతో ఆడుతుందని, అలాంటప్పుడు పాక్‌తో జరిగే ఒక్క మ్యాచ్‌ ఆడకపోవడం వల్ల కలిగే పెద్ద నష్టం ఏమిలేన్నారు. సచిన్‌, మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌లు.. పాక్‌తో భారత్‌ ఖచ్చితంగా ఆడాల్సిందేనని, ఆడి గెలవాలని, ఆడకపోతే అది పాక్‌ లాభమవుతున్నారు.

ఎన్నికల బరిలో దిగాలని భావిస్తున్న గంగూలీ పబ్లిసిటీ స్టంట్‌ కోసమే భారత్‌.. పాక్‌తో మ్యాచ్‌ను రద్దు చేసుకోవాలంటున్నాడని పాక్‌ మాజీ క్రికెటర్‌ మియందాద్‌ చేసిన వ్యాఖ్యలపై గంగూలీ సానుకూలంగా స్పందించాడు. ‘నేను మియందాద్‌ వ్యాఖ్యలపై స్పందించాలనుకోవడం లేదు.  భారత్‌-పాక్‌ మ్యాచ్‌ విషయంలో కేంద్రప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి క్రికెటర్లందరూ కట్టుబడి ఉంటారని చెప్పుకొచ్చారు.