రూల్స్ మారాయి.. ఇకపై ఈజీగా డ్రైవింగ్ లైసెన్స్..

రూల్స్ మారాయి.. ఇకపై ఈజీగా డ్రైవింగ్ లైసెన్స్..

డ్రైవింగ్ లైసెన్స్ పొందటం కోసం ఆర్టీఓ ఆఫీసులో టెస్ట్ కి హాజరవ్వాల్సిన అవసరం లేదంటూ ప్రభుత్వం తెలిపింది. ఆర్టీఓ ఆఫీసుకు బదులు డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల వద్ద టెస్ట్ హాజరయ్యి సర్టిఫికెట్ పొందితే సరిపోతుందని తెలిపింది ప్రభుత్వం. జూన్ 1, 2024నుండి కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయని తెలిపింది. ఈ మేరకు శిక్షణ కేంద్రాలకు కొన్ని కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది ప్రభుత్వం. దీంతో పాటు 90వేల ప్రభుత్వ వాహనాల వాడకంపై ఆంక్షలు కూడా విధించింది ప్రభుత్వం.

ఇకపై మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే 25వేల రూపాయల ఫైన్ కట్టాల్సి ఉంటుందని తెలిపింది ప్రభుత్వం. మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డ వెహికల్ ఓనర్ యొక్క డ్రైవింగ్ రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేస్తామని తెలిపింది ప్రభుత్వం.  ఓవర్ స్పీడింగ్ కి వెయ్యి నుండి రెండువేల రూపాయల ఫైన్ ఉంటుందని తెలిపింది.డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో ప్రభుత్వం తెచ్చిన కొత్త రూల్స్ తో అప్లికేషన్ ప్రాసెస్ కూడా సింప్లిఫై అవ్వనుంది.

డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలకు కొత్త రూల్స్:

కనీస విస్తీర్ణం: డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు కనీసం 1ఎకరా విస్తీర్ణంలో ఉండాలని తెలిపింది ప్రభుత్వం.

టెస్టింగ్ సదుపాయం: డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించేందుకు శిక్షణ కేంద్రాల వద్ద సరైన సదుపాయాలు ఉండాలని తెలిపింది.

ట్రైనర్స్ కి అర్హతలు: ట్రైనర్స్ హైస్కూల్ డిప్లమా లేదా అందుకు సమానమైన విద్యార్హత కలిగి ఉండాలని, కనీసం 5ఏళ్ళ డ్రైవింగ్ శిక్షణ అనుభవం ఉండాలని తెలిపింది ప్రభుత్వం. అంతే కాకుండా ట్రైనర్స్ కి బయోమెట్రిక్ వంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పట్ల అవగాహన ఉండాలని తెలిపింది.

శిక్షణా కాలం: డ్రైవింగ్ శిక్షణా కాలం 4వారాలుగా నిర్ణయించింది ప్రభుత్వం. ఇందులో 8గంటలు థీరియాటికల్ శిక్షణ, 21గంటలు ప్రాక్టికల్ శిక్షణ ఉండాలని తెలిపింది.