- అన్ని జిల్లాల్లో మెగా జాబ్ మేళాలు
- ఇయ్యాల్టి నుంచి ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక
- లోగో రిలీజ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
- మొదటిరోజు మంత్రుల ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల యాక్షన్ ప్లాన్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన లోగోను ప్రభుత్వం రిలీజ్ చేసింది. తొలిరోజు అన్ని ఉమ్మడి జిల్లాల్లో మంత్రుల ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను పురస్కరించుకుని ముందస్తు పండుగలా మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దారు. ఇయ్యాల్టీ నుంచి అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో పెండింగ్ ఫైళ్లను అధికారులు క్లియర్ చేయనున్నారు.
గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పౌర సేవలు, ప్రజల అవసరాలు తీర్చేలా ఐదు దశల్లో ఈ ప్రణాళికను అమలు చేయనున్నారు. ముఖ్య కార్యదర్శులు, కలెక్టర్ల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు అందరినీ ఇందులో భాగస్వాములను చేశారు. గ్రామ, వార్డు సభల్లో స్కీములవారీగా ఎంపికైన లబ్ధిదారుల లిస్టులను బహిరంగంగా డిస్ప్లే చేయనున్నారు. లిస్టులను క్షేత్రస్థాయిలో విచారించి అవసరమైతే వెంటనే అప్డేట్ చేయాలి. గతంలో తీసుకున్న పాత దరఖాస్తులు ఏవైనా పెండింగ్ లో ఉంటే.. అవి ఎందుకు ఆగాయో దానికి గల కారణాలు అధికారులే ప్రజలకు కచ్చితంగా చెప్పాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. విద్యా, వైద్య రంగాల్లో సమూల మార్పులు తెచ్చేందుకు ప్రభుత్వం ఈ యాక్షన్ ప్లాన్ లో రూపకల్పన చేసింది. వచ్చే విద్యా సంవత్సరంలో కొత్తగా 100 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ప్రారంభించి, దీనిపై తల్లిదండ్రుల్లో విస్తృత అవగాహన కల్పించనున్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిని పెంచి, రైతులు అదనపు ఆదాయం పొందే మార్గాలను వివరిస్తారు. స్థలం ఉండి ఇల్లు లేని వారికి ఇందిర మ్మ ఇండ్ల నిర్మాణ ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకుంటారు. రేషన్ కార్డుల పంపిణీని నిరంతర ప్రక్రియగా మార్చి, అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డు అంద జేస్తారు. యువతకు నైపుణ్య శిక్షణతో పాటు, ఉపాధి కల్పన దిశగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మెగా జాబ్ మేళాలు నిర్వహిస్తారు. ఈ ప్రణాళికలో భాగంగా దాదాపు లక్ష మంది యువతకు ఉద్యోగాలు ఇవ్వాలనేది ప్రభుత్వం ప్రధాన టార్గెట్గా ఎంచుకుంది. అన్ని జిల్లాల్లో మహిళా శక్తి భవనాలను ప్రారంభించనున్నారు.
వారానికో టార్గెట్
ఈ లక్ష్యాలను సాధించేందుకు వివిధ శాఖల సమన్వయంతో మార్చి 30 నుంచి జూన్ 6 వరకు పది వారాల పాటు ప్రత్యేక క్యాలెండర్ ప్రకటించారు. మార్చి 30 నుంచి ఏప్రిల్ 4 వరకు గ్రామీణాభివృద్ధి, ఏప్రిల్ 6 నుంచి 11 వరకు ఆరోగ్య రంగానికి సంబంధించి తొలి రెండు వారాలు కేటాయించారు. మూడో వారంలో ఏప్రిల్ 13 నుంచి 18 వరకు అరైవ్-అలైవ్ (రోడ్డు భద్ర త), నాలుగో వారంలో ఏప్రిల్ 20 నుంచి 25 వరకు సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ఏప్రిల్ 27 నుంచి మే 2 వరకు పిల్లల భద్రత-డ్రగ్స్ అడ్డుకట్ట, మే 4 నుంచి 9 వరకు రైతు సంక్షేమంపై 5, 6 వారాల్లో సదస్సులు ఉంటాయి. ఏడో వారం విద్యా రంగానికి (మే 11- నుంచి 16), ఎనిమిదో వారం యువత, క్రీడల కు (మే 18 నుంచి 23) ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేక కార్య క్రమాలు నిర్వహిస్తారు. మే 25 నుంచి 30 వరకు మహిళా సంక్షేమం, జూన్ 1 నుంచి 6 వరకు పర్యావ రణ పరిరక్షణతో ఈ పది వారాల షెడ్యూల్ ముగుస్తుం ది. గత రెండేళ్లలో అమలైన ఈ పథకాల ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలకు జరిగిన మేలును సభల్లో వివ రించనున్నారు సర్పంచుల నుంచి ఎంపీల వరకు, కలె క్టర్ల నుంచి కార్యదర్శుల వరకు ప్రజా ప్రతినిధులు, అధికారులను భాగస్వాములను చేశారు. మండలాలు, జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక స్టాళ్లు, ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసి ‘ప్రజా పాలన’ లక్ష్యం నెరవేరేలా ప్రభుత్వం పకడ్బందీ అడుగులు వేస్తోంది.
