ముంబైలో ఓటు వేసిన సల్మాన్ ఖాన్, ఐశ్వర్య

ముంబైలో ఓటు వేసిన సల్మాన్ ఖాన్, ఐశ్వర్య

లోక్ సభ ఐదో విడత పోలింగ్ ముగిసింది. 6 రాష్ట్రాల్లో 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 49 లోక్ సభ స్థానాలకు పోలింగ్ ముగిసింది. ఇప్పటి వరకు 5 విడతల్లో 430 లోక్ సభ స్థానాలకు పోలింగ్ పూర్తయింది.  మే 25న ఆరో విడత, జూన్ 1న ఏడో విడత పోలింగ్ జరగనుంది. జూన్ 4న కౌంటింగ్ జరగనుంది.

 ముంబైలో పలువురు ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.  బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ముంబైలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశాడు. నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్,   అమితాబచన్,జయాబచన్ క్యూ లైన్లో నిలబడి  ముంబైలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. 

 రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, ముఖేష్ అంబానీ,నీతా అంబానీ కొడుకుతో కలిసి ముంబైలో ఓటు వేశారు.    రతన్ టాటా, గాయకుడు ఉదిత్ నారాయణ్ ముంబైలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.  నటి మాధురీ దీక్షిత్ ముంబైలోని  పోలింగ్ బూత్‌ లో లైన్లో నిలబడి ఓటు వేశారు.  నటి సోనాక్షి సిన్హా తన తల్లి పూనమ్ సిన్హాతో కలిసి ఓటు వేశారు.  సారా అలీఖాన్‌, అమృతా సింగ్‌ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.