తప్పంతా మాదే.. చేసిన పనులను చెప్పుకోలేకపోయాం: కేటీఆర్

తప్పంతా మాదే.. చేసిన పనులను చెప్పుకోలేకపోయాం: కేటీఆర్

రేవంత్ ప్రభుత్వం రాష్ట్రంలో అదానీకి తలుపులు తెరిచిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వ కంపెనీలను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇల్లందులో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు కేటీఆర్. కాంగ్రెస్ సర్కార్ ఇప్పటివరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు. రాష్ట్రానికి ఇప్పుడు ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే దమ్మున్న నాయకుడు కావాలన్న కేటీఆర్.. రాకేశ్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించాలని పిలుపునిచ్చారు కేటీఆర్.


 ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. ఈ ప్రభుత్వ పాలన గురించి 6 నెలల్లోనే ప్రజలకు అర్థమైందన్నారు. బీఆర్ఎస్ హయాంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చామని చెప్పారు.  చేసినపనులను చెప్పుకోలేకపోవడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామన్నారు. తప్పంతా తమదేనన్నారు.