బెంగాల్‎లో మమతా బెనర్జీని మళ్లీ సీఎం కానివ్వను: ఎమ్మెల్యే హుమాయున్ కబీర్

బెంగాల్‎లో మమతా బెనర్జీని మళ్లీ సీఎం కానివ్వను: ఎమ్మెల్యే హుమాయున్ కబీర్

కోల్‌క‌తా: బెంగాల్‌లో ఇన్నాళ్లు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)​పార్టీకి మద్దతుగా ఉన్న ముస్లిం ఓటు బ్యాంకు ఇక పూర్తిగా ఖతం అయిపోతుందని ముర్షిదాబాద్​ టీఎంసీ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్‌ అన్నారు. సీఎం మమతా బెనర్జీని మళ్లీ అధికారంలోకి రాకుండా చేస్తానని ఛాలెంజ్ చేశారు. రాష్ట్రంలోని బెల్దంగాలో బాబ్రీ మసీదు ప్రతిరూపానికి శంకుస్థాపన చేయడంతో హుమాయున్ కబీర్‎ను టీఎంసీ పార్టీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో అతను ఆదివారం మీడియాతో మాట్లాడుతూ “తృణమూల్ పార్టీ ముస్లిం ఓటు బ్యాంకు పూర్తిగా ఖతమైతుంది. బెంగాల్‌లో బీజేపీని రానివ్వను. మమతా బెనర్జీని మళ్లీ సీఎం కానివ్వను. సినిమా ఇంకా పూర్తి కాలేదు (పిక్చర్​అబీ బాకీ హై)” అని అన్నారు. డిసెంబర్ 22న కొత్త పార్టీని ప్రకటిస్తానని చెప్పారు.