నేను దేశానికే ప్రాతినిధ్యం వహిస్తున్నా

నేను దేశానికే ప్రాతినిధ్యం వహిస్తున్నా

న్యూఢిల్లీ: ‘ఒక అథ్లెట్‌‌గా నేను ఇండియాకు ఆడేందుకు ఇక్కడకు వచ్చా. నాకు హిందూ–- ముస్లిం ముఖ్యం కాదు. నేను ఒక సామాజిక వర్గానికి  ప్రాతినిధ్యం వహించను, నా దేశానికే ప్రాతినిధ్యం వహిస్తున్నా’ అని ప్రపంచ చాంపియన్‌‌ బాక్సర్ నిఖత్ జరీన్ స్పష్టం చేసింది. తాను సాధించిన విజయాల కంటే తన మతపరమైన నేపథ్యంపై  సోషల్​ మీడియాలో ఎక్కువగా చర్చ జరగడంపై  నిఖత్‌‌ పైవిధంగా స్పందించింది. దేశం తరఫున పతకాలు సాధిస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పింది. ఇక, ఇంటర్నేషనల్‌‌ ఈవెంట్లలో ఒత్తిడిని జయించడానికి అవసరమైన శిక్షణ ఇస్తే బాగుంటుందని తెలంగాణ బాక్సర్​ అభిప్రాయపడింది.