SIT Telugu OTT: డైరెక్ట్‌గా ఓటీటీకి వచ్చేస్తున్న తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్..స్ట్రీమింగ్ ఎప్పుడు..ఎక్కడంటే?

SIT Telugu OTT:  డైరెక్ట్‌గా ఓటీటీకి వచ్చేస్తున్న తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్..స్ట్రీమింగ్ ఎప్పుడు..ఎక్కడంటే?

టాలీవుడ్ యంగ్ హీరో అరవింద్ కృష్ణ ,రజత్ రాఘవ్ హీరోలుగా న‌టించిన తెలుగు మూవీ ఎస్. ఐ. టి. (S.I.T ). ఎస్ఐటీ అంటే స్పెష‌ల్ ఇన్వేస్టిగేష‌న్ టీమ్ అని అర్థం.ఈ మూవీ నేరుగా  థియేట‌ర్ల‌ను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఓటీటీలో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యింది.

ఈ స్పెషల్ క్రైమ్ స్పెష‌ల్ ఇన్వేస్టిగేష‌న్ థ్రిల్లర్ మే 10 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు జీ5 ఓటీటీ అఫీషియ‌ల్‌గా ప్రకటించింది. ఈ సినిమాలో అరవింద్ కృష్ణ పోలీస్ ఆఫీస‌ర్ గా ఇంటెన్స్ లుక్‌లో అర‌వింద్ కృష్ణ క‌నిపిస్తోన్నాడు. ఈ పోస్టర్ లో క్రైమ్ సీన్ డు నాట్ క్రాస్ అనే ఎల్లో క‌ల‌ర్ స్టిక్క‌ర్స్ తో ఆస‌క్తి పెంచుతోంది. 

ఎస్ఐటీ అంటే స్పెష‌ల్ ఇన్వేస్టిగేష‌న్ టీమ్ అని అర్థం. ఈ కథ విషయానికి వస్తే..ఓ క్రైమ్‌ను సాల్వ్ చేయ‌డంలో ఓ పోలీస్ ఆఫీస‌ర్ టీంకి   ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర‌య్యాయి? సంచ‌ల‌నంగా మారిన క్రైమ్‌ను త‌న తెలివితేట‌ల‌తో ఓ పోలీస్ ఆఫీస‌ర్ ఎలా సాల్వ్ చేశాడు అన్న‌ది థ్రిల్లింగ్‌గా ఈ మూవీలో చూపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. అయితే లాస్ట్ ఇయర్ ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. కానీ, కొన్ని కారణాల వల్ల ఈ సస్పెన్స్ థ్రిల్లర్ డైరెక్ట్ ఓటీటీ బాట పట్టింది. 

ఇక హీరో అరవింద్ కృష్ణ విషయానికి వస్తే.. 

అర‌వింద్ కృష్ణ..ఇట్స్ మై లవ్ స్టోరీ,బిస్కెట్,ప్రేమ‌మ్‌,రామారావు ఆన్ డ్యూటీతో పాటు మ‌రికొన్ని సినిమా ల్లో కనిపించాడు.ఓ వైపు ఇంపార్టెంట్ రోల్స్ చేస్తూనే హీరోగా కూడా చిన్న సినిమాలు చేస్తున్నాడు అర‌వింద్ కృష్ణ‌.ప్ర‌స్తుతం ఏ మాస్ట‌ర్ పీస్ సినిమాలో హీరోగా న‌టిస్తోన్నాడు.ఈ మూవీ షూటింగ్ జ‌రుగుతోంది. ర‌జ‌త్ రాఘ‌వ్ కూడా తెలుగులో కొన్ని సినిమాల్లో హీరోగా,విల‌న్‌గా చేస్తూ బిజీగా ఉన్నారు.