భూమికి లక్షా 20వేల అడుగుల ఎత్తులో వరల్డ్ కప్ ట్రోఫీ ఆవిష్కరణ 

భూమికి లక్షా 20వేల అడుగుల ఎత్తులో వరల్డ్ కప్ ట్రోఫీ ఆవిష్కరణ 

ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ 2023 ట్రోఫీ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ఈ మెగా టోర్నీ ట్రోఫీని ఐసీసీ అంతరిక్షంలో ఆవిష్కరించింది. భూమికి 1,20,000 అడుగుల ఎత్తులో వున్న స్ట్రాటోస్పియర్ ఆవరణలోకి ప్రవేశపెట్టింది. ట్రోఫీని బెస్పోక్ స్ట్రాటోస్పియర్ బెలూన్‌కు జోడించి ఆకాశంలోకి పంపారు. అనంతరం ఆ బెలూన్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది. 

ఈ ప్రయోగంతో ప్రపంచ కప్ 2023 ట్రోఫీ అంతరిక్షంలోకి పంపిన మొదటి అధికారిక క్రీడా ట్రోఫీగా చరిత్ర సృష్టించింది. ఈ విషయంపై బీసీసీఐ కార్యదర్శి జై షా మాట్లాడుతూ.. "ఇతర ఏ క్రీడలకు సాధ్యం కాని విధంగా క్రికెట్.. భారతదేశాన్ని ఏకం చేస్తోంది. ఆరువారాల పాటు ప్రపంచంలోని పది అత్యుత్తమ జట్లకు ఆతిథ్యం ఇచ్చేందుకు బీసీసీఐ సిద్ధమవుతున్న వేళ దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు మరింత ఉత్సాహం చూపుతున్నారు. వరల్డ్ కప్ ట్రోఫీ టూర్ వల్ల అభిమానులు ప్రపంచంలో ఏ మూలన వున్నా ఈ ఈవెంట్‌లో భాగం కావడానికి ఒక అద్భుత అవకాశం..' అని జై షా వెల్లడించాడు.

An out-of-this-world moment for the cricketing world as the #CWC23 trophy unveiled in space. Marks a milestone of being one of the first official sporting trophies to be sent to space. Indeed a galactic start for the ICC Men's Cricket World Cup Trophy Tour in India. @BCCI @ICCpic.twitter.com/wNZU6ByRI5

— Jay Shah (@JayShah) June 26, 2023

ఈ ట్రోఫీ త్వరలోనే ప్రపంచ దేశాలకు పయనం కానుంది. బహ్రెయిన్, మలేషియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, అమెరికా, పాపువా న్యూ గినియా, నైజీరియా, ఉగాండా, ఫ్రాన్స్, ఇటలీ సహా ప్రపంచవ్యాప్తంగా 18 దేశాలను చుట్టిరానుంది.

ICC World Cup 2023 Trophy becomes one of the first official sporting trophies to send to space.

Great work by BCCI & ICC. pic.twitter.com/VKcGmTzQrS

— Johns. (@CricCrazyJohns) June 26, 2023