ఇండియా, న్యూజిలాండ్ ఫైనల్‌‌‌‌‌‌‌‌కు అంపైర్లుగా ఇల్లింగ్‌‌‌‌‌‌‌‌వర్త్‌‌‌‌‌‌‌‌, వార్ఫ్‌‌‌‌‌‌‌‌

ఇండియా, న్యూజిలాండ్ ఫైనల్‌‌‌‌‌‌‌‌కు అంపైర్లుగా ఇల్లింగ్‌‌‌‌‌‌‌‌వర్త్‌‌‌‌‌‌‌‌, వార్ఫ్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ఇండియా, న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌ మధ్య ఆదివారం జరిగే టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ ఫైనల్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు ఐసీసీ అంపైర్లను ప్రకటించింది. ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌కు చెందిన రిచర్డ్‌‌‌‌‌‌‌‌ ఇల్లింగ్‌‌‌‌‌‌‌‌వర్త్‌‌‌‌‌‌‌‌, అలెక్స్‌‌‌‌‌‌‌‌ వార్ఫ్‌‌‌‌‌‌‌‌ అంపైర్లుగా వ్యవహరిస్తారని వెల్లడించింది. 2024లోనూ క్రిస్‌‌‌‌‌‌‌‌ గఫానీతో కలిసి ఇల్లింగ్‌‌‌‌‌‌‌‌వర్త్‌‌‌‌‌‌‌‌ టైటిల్‌‌‌‌‌‌‌‌ ఫైట్‌‌‌‌‌‌‌‌కు బాధ్యతలు నిర్వర్తించాడు. దాంతో అతనికి ఇది రెండో టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ ఫైనల్‌‌‌‌‌‌‌‌ కావడం విశేషం. 

మెన్స్‌‌‌‌‌‌‌‌ 2023 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌, 2025 చాంపియన్స్‌‌‌‌‌‌‌‌ ట్రోఫీ ఫైనల్స్‌‌‌‌‌‌‌‌లోనూ ఇల్లింగ్‌‌‌‌‌‌‌‌వర్త్‌‌‌‌‌‌‌‌ అంపైర్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరించాడు. వార్ఫ్‌‌‌‌‌‌‌‌కు మాత్రం ఇది తొలి ఐసీసీ ఫైనల్‌‌‌‌‌‌‌‌. గతంలో 2022 విమెన్స్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌, 2023 మెన్స్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో స్టేజ్‌‌‌‌‌‌‌‌ స్థాయిలో బాధ్యతలు నిర్వర్తించాడు. గతేడాదే ఎమిరేట్స్‌‌‌‌‌‌‌‌ ఐసీసీ ఎలైట్‌‌‌‌‌‌‌‌ ప్యానెల్‌‌‌‌‌‌‌‌లో ఆఫ్‌‌‌‌‌‌‌‌ అంపైర్లలో చేరాడు. అల్లాహుద్దీన్‌‌‌‌‌‌‌‌ పాలేకర్‌‌‌‌‌‌‌‌, అడ్రియన్‌‌‌‌‌‌‌‌ హోల్డ్‌‌‌‌‌‌‌‌స్టాక్‌‌‌‌‌‌‌‌లకు థర్డ్‌‌‌‌‌‌‌‌, ఫోర్త్‌‌‌‌‌‌‌‌ అంపైర్లుగా బాధ్యతలు కట్టబెట్టారు. ఆండీ పైక్రాఫ్ట్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ రిఫరీగా వ్యవహరిస్తాడు.