టెస్టుల్లో టీమిండియా దూసుకుపోతోంది. ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్‌ను గెలిచిన భారత్.. తాజాగా ఇంగ్లండ్‌తో సిరీస్‌నూ కైవసం చేసుకుంది. ఇంగ్లండ్‌పై సిరీస్‌లో గ్రాండ్ విక్టరీతో టెస్టు వరల్డ్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకున్న టీమిండియాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా నాలుగో టెస్టులో భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించిన రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్‌ను సీనియర్ క్రికెటర్లు మెచ్చుకుంటున్నారు. పాకిస్థాన్ మాజీ స్పీడ్‌స్టర్ షోయబ్ అక్తర్ కూడా వీరిని ప్రశంసించాడు. మొతేరా లాంటి స్పిన్ ట్రాక్‌పై పంత్, సుందర్ బాగా బ్యాటింగ్ చేయగలిగినప్పుడు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ కూడా బాగా మరింత మెరుగ్గా ఆడాల్సిందన్నాడు.
‘ఇది ఇంగ్లండ్ జట్టుకు ఘోర ఓటమి. భారత్‌తో స్వదేశంలో తలపడితే ఎలా ఉంటుందో ఇంగ్లండ్‌కు తెలిసొచ్చింది. అయితే ఉపఖండ స్పిన్ పిచ్‌ల మీద ఎలా ఆడాలో ఆ టీమ్ నేర్చుకోవాలి. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ తడబడిన చోటే ఇండియా 365 పరుగుల స్కోరు చేసింది. పంత్, సుందర్ బాగా రన్స్ చేసినప్పుడు ఇంగ్లండ్ ఆటగాళ్లు ఎందుకు పరుగులు చేయలేరు? ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను అక్షర్ పటేల్ తన స్పిన్ మాయతో బోల్తా కొట్టాడు. బ్యాట్స్‌మెన్‌ను నిలదొక్కుకోకుండా చేసి పెవిలియన్‌కు పంపడం భేష్ అనే చెప్పాలి. అతడు మరికొన్ని సిరీస్‌లు ఇలాగే ఆడితే అత్యంత వేగంగా 100 వికెట్ల మైలురాయిని చేరుకున్న బౌలర్‌గా నిలుస్తాడు’ అని అక్తర్ చెప్పాడు.

