మీకు కవల పిల్లలా.. పెంపకం ఎలా ఉండాలంటే..

మీకు కవల పిల్లలా..  పెంపకం ఎలా ఉండాలంటే..

పిల్లల్ని పెంచడం పేరెంట్స్ కి పెద్ద సవాలే.. వాళ్లను సంతోషంగా, ఆరోగ్యంగా బాధ్యత తెలిసిన వాళ్లుగా పెంచడం కష్టమైన పనే. కారణం పిల్లలు శారీరకంగా ఎదుగుతున్న కొద్దీ వాళ్ల మానసిక స్థితి కూడా మారుతూ ఉంటుంది. మరి అలాంటప్పుడు పేరెంట్స్ కూడా పిల్లల వయసును దృష్టిలో పెట్టుకుని.. వాళ్లకు సలహాలు, సూచనలు ఇస్తూ జాగ్రత్తగా పెంచాలి. పిల్లలు ట్వీన్స్ లో ఉన్నప్పుడు… ముఖ్యంగా ఆడపిల్లలను స్ట్రాంగ్ గా.. ఎంపవర్డ్ గా పెంచాలి. దాని కోసం పెద్దలు తెలుసుకోవాల్సిన పేరెంటింగ్ టిప్స్ చాలా ఉంటాయి.

ట్వీనేజీ కిడ్స్.. అంటే తొమ్మిది నుంచి పన్నెండేళ్ల వయసున్న పిల్లలు అని అర్థం. ఇప్పటి వరకు టీనేజ్ పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించే అందరూ మాట్లాడుతూ ఉంటారు. కానీ ట్వీనేజీ కూడా పిల్లల క్యారెక్టర్ డెవలప్ మెంట్ లో చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ వయసులో పిల్లలకు ఫ్యామిలీ నునంచి ఎక్స్ పెక్టేషన్స్ విషయంలో పూర్తి అవగాహన ఉండదు. అలాగే పిల్లల పర్సనాలిటీ డెవలప్ మెంట్ లో కూడా ఈ టైమ్ లో పేరెంట్స్ ముఖ్యపాత్ర పోషించాలి. అమ్మాయిల్లో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెంచాలంటే ట్వీనేజీ బెస్ట్ టైమ్ గా చెప్పొచ్చు.

క్యమూనికేషన్ పెంచుకోవాలి

అమ్మాయిలు ట్వీనేజీలో కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటారు. అయితే మునుపటిలా ప్రతిదాన్నీ పేరెంట్స్ తో పంచుకోవాడానికి మొహమాటపడతారు. ఇతరులు చేసిన తప్పులను తమ పొరపాటుగా భావించి భయపడుతుంటారు. ఈ విషయాన్ని పేరెంట్స్ గమనించి తరచూ వాళ్లతో ఫ్రెండ్లీగా కమ్యూనికేట్ అవ్వాలి. అలాంగ్ వెకేషన్ కాకపోయినా ప్రకృతి అందాలను చూపిస్తూ పిల్లలను నేచర్ కి కనెక్ట్ చేయాలి. ట్వీన్స్ అమ్మాయిల్లో చాలా మంది బాడీ షేమింగ్ కి గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి వాటిని తల్లులు గమనించి ప్రేమగా కమ్యూనికేట్ అవ్వాలి.

సపోర్టర్ గా మార్చాలి

స్కూల్లో ఇంటి దగ్గరున్న తోటి అమ్మాయిల మధ్య ఈ వయసులోనే కంపేరిజన్ పెరుగుతుంది. తన క్లాస్ అమ్మాయి చదువులో లేదా ఎక్స్ ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో ఏదైనా సాధిస్తే.. మిగిలిన అమ్మాయిలు ఆమెను ఎంకరేజ్ చేయాలి.

ముందే చెప్పాలి

జీవితంలో పొరపాట్లు జరగడం, వాటిపై రిగ్రెట్ ఫీలవ్వడం కూడా సాధారణ విషయమే. కానీ ఇక్కడ ముఖ్యమైన అంశం ఏమిటంటే.. చేసిన తప్పులకు, జరిగిన పొరపాట్లకు బాధ పడకుండా తప్పించుకోవడం వంటి పనులు చేస్తుంటే మాత్రం తప్పు. ట్వీన్ అమ్మయిలను ఎంపవర్ చేయాలంటే, వాళ్లకు ఎదురయ్యే ఛాలంజ్ లను ముందుగానే చెప్పాలి. అలాగే ఎలాంటి ఓటమి, అవమానం ఎదురైనా.. మరింత ధైర్యంగా ముందుకెళ్లేలా పిల్లలను పెంచాలి. బాధ కలిగినప్పుడు ఎవరిపై వాళ్లకు జాలి కలగడం  ముఖ్యమే. కానీ అది ముందడుగు వేయడానికి అడ్డు కాకూడదు.