ఐడీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ .. మరో హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఐడీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ .. మరో హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • ఐడీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ .. మరో హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • ఇంకో ఐదేళ్లలో మారుతుంది
  • బ్యాంక్ ఎండీ వైద్యనాథన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నాడనే గత 2 ఏళ్లుగా షేర్లు కొంటున్నా
  • దేవయాని ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, యునైటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పిరిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇండియన్ హోటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నా టాప్ పిక్స్
  • సీనియర్ ఇన్వెస్టర్ సంజీవ్ భాసిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ : ఐఐఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్యూరిటీస్ డైరెక్టర్, సీనియర్ ఇన్వెస్టర్ సంజీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భాసిన్  ఐడీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ ఫస్ట్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై బుల్లిష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్నారు. గత రెండేళ్ల నుంచి ఈ షేరు కొనాలని సలహా ఇస్తున్నానని అన్నారు. అప్పుడు ఈ షేరు రూ.30–35 దగ్గర ఉందని చెప్పారు. ‘వైద్యనాథన్ వలనే ఈ షేరుపై బుల్లిష్​గా మారాను. నా దృష్టిలో ఆయన ఇండియాలో బెస్ట్ బ్యాంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. ఇప్పుడీ ఈ షేరు ఖరీదుగా మారింది.  ఐడీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ ఫస్ట్ బ్యాంక్ ఇంకో ఐదేళ్లలో హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల మారుతుంది. ప్రస్తుతం బ్యాంక్ షేరు రూ.85–90 దగ్గర కన్సాలిడేట్ అవుతోంది’ అని వివరించారు. 

ఐసీఐసీఐ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కూడా ఆయన బుల్లిష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న రేట్ల దగ్గర ఏదైనా ఒక షేరులో తన డబ్బులు పెట్టాలనుకుంటే ఐసీఐసీఐ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎంచుకుంటానని చెప్పారు. నిఫ్టీ వచ్చే వారం 20 వేలు టచ్ చేస్తుందని, ఈ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఐసీఐసీఐ బ్యాంక్ షేరు రూ.1,100–1,150 కి చేరుకుంటుందని అంచనావేశారు.

ఆల్కహాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బేవరేజెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డొవెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆయన ఓటు వేశారు. గత 18 ఏళ్ల నుంచి ఈ కంపెనీ షేర్లను హోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నానని, ఆల్కహాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పుంజుకుంటోందని చెప్పారు. దేవయాని ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తన లిస్టులో టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంటుందని అన్నారు. యునైటెడ్ స్పిరిట్ కూడా బాగానే ఉందని పేర్కొన్నారు. కన్జూమర్ షేర్లలో పేజ్ ఇండస్ట్రీస్ కచ్చితంగా కొనుక్కోవాలని సంజీవ్ భాసిన్ అన్నారు. ఈ షేరు పడినప్పుడు కొనుక్కోవాలని సలహా ఇచ్చారు. ఇండియన్ హోటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, దేవయాని లేదా యునైటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పిరిట్స్ వంటి బ్రాండ్లు మళ్లీ క్రియేట్ కావని అభిప్రాయపడ్డారు.