కేరళలో పలుచోట్ల భారీ వర్షాలు..4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ

కేరళలో పలుచోట్ల భారీ వర్షాలు..4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ

తిరువనంతపురం: కేరళలో నైరుతి రుతుపవనాల రాకకు సమయం దగ్గర పడుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం వేగంగా మారిపోతోంది. శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ(ఐఎండీ) 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి మూడు గంటల పాటు త్రిసూర్, కొల్లాం, కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు(11 సెంటీమీటర్ల నుండి 20 సెంటీమీటర్ల వరకు) కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఒకటి రెండు చోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది.