న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ చాంపియన్ షిప్స్‌లో స్టార్లు, సీనియర్ ప్లేయర్లు లేకుండానే ఇండియా టీమ్ పోటీ పడనుంది. మలేసియా వేదికగా ఫిబ్రవరి 15 నుంచి 20 వరకు జరిగే ఈ టోర్నీలో పాల్గొనే మెన్, విమెన్ టీమ్స్‌ను బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్) శనివారం ప్రకటించింది. యంగ్ సెన్సేషన్, ఇండియా ఓపెన్ చాంపియన్ లక్ష్యసేన్ మెన్స్ టీమ్‌ను, సయ్యద్ మోడీ టోర్నీ ఫైనలిస్ట్ మాళవిక బన్సొద్ విమెన్స్ టీమ్‌ను లీడ్ చేయనున్నారు. గత నెల చెన్నై, హైదరాబాద్‌లో జరిగిన ఆల్ ఇండియా ర్యాంకింగ్ టోర్నీల్లో రాణించిన యంగ్ ప్లేయర్లకు అవకాశం ఇచ్చారు. కొవిడ్, గాయాల నుంచి కోలుకుంటున్నందున సీనియర్ ప్లేయర్లు ఈ టోర్నీకి దూరమయ్యారని బాయ్ తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో బెంచ్ స్ట్రెంత్ బలాన్ని తెలుసుకునేందుకు ఇది తమకు ఓ మంచి అవకాశమని పేర్కొంది. కాగా, మనీలాలో జరిగిన లాస్ట్ ఎడిషన్ లో మెన్స్ టీమ్ బ్రాంజ్ కైవసం చేసుకుంది. కొవిడ్ కారణంగా విమెన్స్ టీమ్ అక్కడకు వెళ్లేందుకు నిరాకరించింది.
టీమ్.. మెన్స్ సింగిల్స్: లక్ష్యసేన్, మిథున్ మంజునాథ్, కిరణ్ జార్జ్, రఘు; మెన్స్ డబుల్స్: పీఎస్ రవికృష్ణ–ఉదయ్ కుమార్, హరిహరణ్–రుబన్ కుమార్, డింకు సింగ్–మంజీత్ సింగ్;
విమెన్స్ సింగిల్స్: మాళవిక బన్సొద్, ఆకర్షి కశ్యప్, అష్మితా చాలిహ, తారా షా; విమెన్స్ డబుల్స్: సిమ్రన్ సింఘి–ఖుషి గుప్తా, వి నీలా–అరుబాల, ఆర్తి సారా–రిజా మెహ్రీన్ .

