పాకిస్తాన్‌ను చిత్తు చిత్తుగా ఓడించిన భారత్.. దెబ్బకి సెమీ-ఫైనల్స్‌లోకి ఎంట్రీ!

పాకిస్తాన్‌ను చిత్తు చిత్తుగా ఓడించిన భారత్.. దెబ్బకి సెమీ-ఫైనల్స్‌లోకి ఎంట్రీ!

India vs Pakistan: చైనాలోని మోకీ వేదికగా జరుగుతున్న మహిళల జూనియర్ ఆసియా కప్ 2026 హాకీ టోర్నీలో భారత జూనియర్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. క్వార్టర్‌ఫైనల్ నాకౌట్ మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌ను ఏకంగా 19–0 తేడాతో తొక్కిపారేసింది. మ్యాచ్ ప్రారంభంలోనే విజృంభించిన ఇండియన్ ప్లేయర్లు ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై విరుచుకుపడుతూ పాక్ ను పూర్తిగా ఆత్మరక్షణలో పడేశారు. ఈ ఘన విజయంతో భారత్ టోర్నీ సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.

పాక్ గోల్‌పోస్ట్‌పై విరుచుకుపడిన భారత నారీ సేన: 

ఈ మ్యాచ్ తొలి నిమిషం నుంచే భారత హాకీ జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. 7వ నిమిషంలో పూజా సాహు వేసిన తొలి గోల్‌తో పాకిస్థాన్ డిఫెన్స్‌లో వణుకు స్టార్ట్ అయింది. తొలి రెండు క్వార్టర్లలో 5 చొప్పున గోల్స్ కొట్టిన భారత్, హాఫ్ టైమ్ సమయానికే 10–0 ఆధిక్యంతో పాక్ కొంపముంచింది. సెకండ్ హాఫ్‌లోనూ అదే దూకుడు కొనసాగిస్తూ మరో 9 గోల్స్ సాధించి పాకిస్థాన్‌ను 19–0 తేడాతో పూర్తిగా వాష్‌అవుట్ చేసింది.

►ALSO READ | లండన్‌లో పాక్ జట్టుకు ఘోర అవమానం.. శరణార్థులనుకుని హోటల్ చుట్టూ నిరసనకారులు!

సెమీస్‌లో భారత్.. హ్యాట్రిక్ టైటిల్‌పై కన్ను: 

గతంలో 2023, 2024లలో ఛాంపియన్‌గా నిలిచిన భారత జూనియర్ హాకీ జట్టు, ఇప్పుడు వరుసగా మూడోసారి టైటిల్ గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలతో ఉంది. గ్రూప్ దశలోనే జపాన్, మలేషియా, దక్షిణ కొరియా జట్లను ఊచకోత కోసి టాప్‌లో నిలిచిన టీమిండియా, సెప్టెంబర్ 12వ తేదీన జరగబోయే సెమీఫైనల్లో దక్షిణ కొరియా vs మలేషియా మ్యాచ్ విజేతతో తలపడనుంది.

పూజా మాలిక్ హ్యాట్రిక్: 

* పూజా మాలిక్: అద్భుతమైన హ్యాట్రిక్ గోల్స్‌తో మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.
* సానికా మానె: రెండు క్లాసిక్ గోల్స్‌తో పాక్ డిఫెన్స్‌ను తుత్తునియలు చేసింది.
* సుప్రియ & పూర్ణిమ యాదవ్: చెరో రెండు గోల్స్ బాది భారత్ ఆధిక్యాన్ని పెంచారు.
* పూజా సాహు: 7వ నిమిషంలో తొలి గోల్‌తో భారత గోల్స్ వేటను ప్రారంభించింది.