న్యూఢిల్లీ: ప్రపంచంలోనే ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న మనదేశం, 2025లో ఆరో స్థానానికి పడిపోయింది. గత ఏడాదితో పోలిస్తే ఒక స్థానం దిగువకు చేరిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) తెలిపింది. ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నప్పటికీ ఈ మార్పు చోటుచేసుకుంది. 2025లో భారత ఆర్థిక వ్యవస్థ విలువను 3.92 ట్రిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. ప్రస్తుతం భారత్ కంటే ముందు యూకే 4 ట్రిలియన్ డాలర్లు, జపాన్ 4.44 ట్రిలియన్ డాలర్లతో ఉన్నాయి.
ఈ జాబితాలో అమెరికా 30.8 ట్రిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, చైనా 19.6 ట్రిలియన్ డాలర్లు, జర్మనీ 4.7 ట్రిలియన్ డాలర్లతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 2024లో భారత్ 3.5 ట్రిలియన్ డాలర్లతో ఐదో స్థానంలో ఉండేది. డాలర్ విలువ పెరగడం వల్ల ర్యాంకు తగ్గింది.

