అత్యంత ప్రమాదకర దేశాలలో భారత్ నెంబర్ 1

అత్యంత ప్రమాదకర దేశాలలో భారత్ నెంబర్ 1

ప్రస్తుతం దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. రోజూ ఎక్కడో చోట మహిళలు దారుణాలకు గురవుతూనే ఉన్నారు. ప్రపంచం ఎంత అభివృద్ధి చెందినా, టెక్నాలజీ ఎన్ని కొత్త పుంతలు తొక్కినా.. మహిళకు మాత్రం రక్షణ కరువైంది.

లండన్‌కు చెందిన థామ్సన్ రాయిటర్స్ ఫౌండేషన్ అనే సంస్థ ఏడు సంవత్సరాల క్రితం ఓ సర్వే నిర్వహించింది. అప్పుడు మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశాలుగా ఆఫ్ఘనిస్తాన్, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, పాకిస్తాన్, ఇండియా మరియు సోమాలియాలను గుర్తించారు. మళ్లీ ఇప్పటి పరిస్థితులను బట్టి మరోసారి సర్వే నిర్వహించాలని ఆ సంస్థ ప్రతినిధులు భావించారు. సర్వేలో భాగంగా మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలు, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక వనరులు, ఆచార పద్ధతులు, లైంగిక హింస, లైంగికేతర హింస మరియు మానవ అక్రమ రవాణా గురించి తెలుసుకోవాలనుకున్నట్లు తెలిపారు. ఆ సర్వేలో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి సర్వేలో మహిళలకు అత్యంత ప్రమాదకర దేశాలలో ఇండియా మొదటిస్థానంలో నిలిచింది. అవును ఇది నిజం.. మీకు అనుమానం ఉంటే ఓసారి గూగుల్‌లో అన్‌సేఫ్ కంట్రీస్ అని టైప్ చేసి చూడండి మీకే తెలుస్తుంది. హైదరాబాద్‌లో జరిగిన డాక్టర్ హత్యోదంతం ఇండియాను ప్రపంచ దేశాలముందు ఇంతలా దిగజారేలా చేసింది.

2030 నాటికి మహిళలు మరియు బాలికలపై హింస మరియు వివక్షను తొలగిస్తామని ప్రపంచ నాయకులు మూడేళ్ల క్రితం ప్రతిజ్ఞ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురిలో ఒకరు శారీరక లేదా లైంగిక హింసకు గురవుతున్నట్లు తెలుస్తోంది. బాల్య వివాహాల ప్రభావం ఇప్పటికీ ఎక్కువగానే ఉంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 750 మిలియన్ల మంది మహిళలు మరియు బాలికలు 18 సంవత్సరాలలోపే పెళ్లిళ్లు చేసుకున్నట్లు సర్వేలో తేలింది. దాని ఫలితంగా వారు టీనేజ్ దశలోనే తల్లులుగా మారడంతో వారి ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది.

టాప్ టెన్ ప్రమాదకర దేశాలు
1. ఇండియా
2. ఆఫ్ఘనిస్తాన్
3. సిరియా
4. సోమాలయా
5. సౌదీ అరేబియా
6. పాకిస్థాన్
7. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో
8. యెమన్
9. నైజీరియా
10. అమెరికా

For More News

విచారణలో గోప్యత.. ఘటనా స్థలానికి నేడు దిశ నిందితులు!
లోన్ ఇవ్వలేదని బ్యాంక్ మేనేజర్ పై దాడి
హైదరాబాద్‌లో అక్కడ దెయ్యాలున్నాయట!