భారత్ ఎప్పటికీ హిందూ దేశం కాలేదు: ఓవైసీ

భారత్ ఎప్పటికీ హిందూ దేశం కాలేదు: ఓవైసీ

ఎంఐఎం అధినేత ఓవైసీ, అస్సాం  ఆర్థిక మంత్రి హిమంత బిశ్వా శర్మ మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం నడుస్తోంది. ఇటీవల అస్సాంలో 19 లక్షల మంది భారతీయులు కారని నేషనల్ రిజిస్టర్ సిటిజన్స్(ఎన్ఆర్సీ) చెప్పడంతో వీరి మధ్య ట్విట్టర్ వార్ మొదలైంది. ఎన్ఆర్సీని ఉపయోగించుకుని ముస్లీంలను దేశం నుంచి పంపించేస్తున్నారని ఓవైసీ ట్వీట్ చేశారు. దీనికి బదులిచ్చిన హిమంత బిశ్వా.. హిందువులను భారతదేశం కాపాడకపోతే ఎవరు రక్షిస్తారు? పాకిస్థాన్ రక్షిస్తుందా? అంటూ కౌంటర్ ఇచ్చారు. హిందువులకు భారత్ ఒక ఇల్లులా ఉంటుందన్నారు.

హిమంత బిశ్వా వ్యాఖ్యలను తప్పుబట్టిన ఓవైసీ భారత్ లో హిందువులనే కాకుండా భారతీయులందర్నీ రక్షించాలని అన్నారు. మతం, కులం ఆధారంగా ప్రజలను విభజించకూడదన్నారు. మతం అనే పదం భారత పౌరసత్వ చట్టాలలో ఎక్కడా ప్రస్తావించబడలేదన్నారు.  మతం పౌరసత్వానికి ఆధారం కాదన్నారు. అందరినీ  సమానంగా చూడమని రాజ్యంగం చెబుతుందన్నారు. అలా అయితే భారత్ ఎప్పటికీ హిందూ దేశం కాలేదని వ్యాఖ్యానించారు ఓవైసీ.