ముంబై: భారత్తో జరిగే టీ20 వరల్డ్ కప్ మ్యా్చ్ను బాయ్కాట్ చేయాలన్న నిర్ణయాన్ని పాకిస్థాన్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.ఈ మ్యాచ్ జరగకపోతే ఐసీసీకి దాదాపు 174 మిలియన్ డాలర్ల ఆదాయం కోల్పోయే పరిస్థి తి ఉండేది. ఇందులో టీవీ ప్రసార హక్కులు, టికెట్ల అమ్మకాలు, స్పాన్సర్ షిప్ ఆదాయం అన్నీ ఉన్నాయి. భారత్ పాకిస్థాన్ మ్యాచ్ ఖరారైన వెంటనే ముంబై-కొలంబో రౌండ్ ట్రిప్ విమాన టికెట్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. కొన్ని రూట్లలో 10 వేల నుంచి 60 వేల రూపాయల వరకు ధరలు పెరిగినట్టు సమాచారం.
బంగ్లాదేశ్కు మద్దతుగా నిలుస్తామని పాక్ తొలుత గట్టిగా చెప్పింది. శ్రీలంకలో ఆడాలన్న బంగ్లాదేశ్ అభ్యర్థన తి రస్కరణకు గురికావడంతో ఐసీసీ బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ను తీసుకురావాలని కూడా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ బోర్డు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, ఐసీసీ మధ్య తెరవెనుక చర్చలు జరిగాయి. నిన్న రాత్రి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటన విడుదల చేస్తూ, భారత్తో ఫిబ్రవరి 15 మ్యాచ్ ఆడాలని పాక్ను కోరింది. ఈ సమయంలో పాక్ చేసిన సహకారానికి బంగ్లాదేశ్ కృతజ్ఞతలు తెలిపింది.
అనంతరం పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, శ్రీలంక అధ్యక్షుడు అసురకుమార దిస్సనాయకే మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. స్నేహపూర్వక దేశాల విజ్ఞప్తులు, చర్చల ఫలితాల నేపథ్యంలో భారత్తో మ్యాచ్ ఆడాలని పాక్ ప్రభుత్వం తన జట్టుకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో క్రికెట్ ప్రపంచం ఊపిరి పీల్చుకుంది.
* భారత్- పాక్ మ్యాచ్ ఎఫెక్ట్.. ఒక్కసారిగా పెరిగిన విమాన టికెట్ ధరలు
* ఫిబ్రవరి15న కొలంబో వేదికగా భారత్‌తో జరగనున్న మ్యాచ్‌లో పాక్ యూటర్న్
* ఇండియాతో తాము మ్యాచ్ ఆడతామని పాకిస్థాన్ ప్రకటన
* ముంబయి నుంచి కొలంబోకి అమాంతం పెరిగిన విమాన టికెట్ల ధరలు
* నిమిషాల వ్యవధిలో ఈ టికెట్ ధర రూ.10 వేల వరకు పెరుగుదల
