పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో జాబ్స్ నోటిఫికేషన్

పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో జాబ్స్ నోటిఫికేషన్

న్యూఢిల్లీ: నిరుద్యోగులకు శుభవార్త. పోస్టల్ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఢిల్లీ సర్కిల్‌‌‌లోని చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ కార్యాలయంలో 220 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. స్పోర్ట్స్ కోటా కింద పోస్టల్ అసిస్టెంట్, పోస్ట్‌మ్యాన్‌తోపాటు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌ చేయనున్నారు. ఆసక్తి ఉన్న వారు పోస్టల్ శాఖ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పలు వివరాలు.. 

ఏయే ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవాలె

  • పోస్టల్ లేదా సార్టింగ్ అసిస్టెంట్. పోస్ట్ ఆఫీసులు లేదా రైల్వే మెయిల్ ఆఫీసుల్లో పని చేయాలి. 
  • పోస్ట్‌మ్యాన్ (పోస్ట్ ఆఫీస్)
  • ఎంటీఎస్ (పోస్టు ఆఫీస్‌ లేదా రైల్వే మెయిల్ ఆఫీసుల్లో పని చేయాలి)

ఎన్ని ఉద్యోగాలు.. 

  • పోస్టల్ అసిస్టెంట్ల: 72
  • పోస్ట్‌మ్యాన్: 90 
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 59

అర్హత వయస్సు 

  • పోస్టల్ అసిస్టెంట్ లేదా సార్టింగ్ అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టులకు నవంబర్ 12, 2021 వరకు అభ్యర్థులు 18 నుంచి 27 ఏళ్ల వయస్సు లోపు ఉండాలి. 
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌ పోస్టులకు నవంబర్ 12, 2021 వరకు అభ్యర్థులు 18 నుంచి 25 ఏళ్ల లోపు వయస్సు ఉండాలి. 

ఎంత జీతం ఇస్తారు?

  • పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగులకు లెవల్ 4 కింద నెలకు రూ. 25,500 నుంచి రూ. 81,100 శాలరీ వస్తుంది. 
  • పోస్ట్‌మ్యాన్ ఉద్యోగులకు లెవల్ 3 కింద నెలకు రూ.21,700 నుంచి రూ. 69,100 జీతం ఇస్తారు. 
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కు లెవల్ 1 కింద నెలకు రూ. 18 వేల నుంచి రూ.56,900 వేతనం వస్తుంది. 

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

ఈ ఉద్యోగాలకు అర్హులు, ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకోవాలి. www.indiapost.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆఫ్‌లైన్‌లో అప్లయ్ చేయాలనుకుంటే తమ అప్లికేషన్లను పోస్టును ఏడీ (రిక్రూట్‌మెంట్), ఓబైఓ సీపీఎంజీ, ఢిల్లీ సర్కిల్, మేఘదూత్ భవన్‌, న్యూఢిల్లీ, 110001 అడ్రస్‌కు తమ డాక్యుమెంట్లను పంపాలి. ఈ జాబ్స్‌లో ఆసక్తి కలిగిన వారు చివరి తేదీ నవంబర్ 12, 2021 లోపు అప్లయ్ చేసుకోవాలి.  

మరిన్ని వార్తల కోసం: 

పునీత్‌ను చూసి కన్నీళ్లు పెట్టుకున్న బాలకృష్ణ

సింహాన్ని పరిగెత్తించిన గ్రామ సింహం

కాంగ్రెస్ వల్లే మోడీ మరింత పవర్‌ఫుల్‌