బెంగళూరు: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌కు నందమూరి బాలకృష్ణ నివాళి అర్పించారు. పునీత్ భౌతిక కాయాన్ని చూసి ఆయన కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. పునీత్‌తో మంచి అనుబంధం కలిగిన బాలయ్య భావోద్వేగానికి లోనయ్యారు. పునీత్ సోదరుడు శివరాజ్‌కుమార్ బాలయ్యను పట్టుకుని భోరున ఏడ్చేశారు. ఆయన్ను బాలకృష్ణ ఓదార్చారు.
పునీత్‌ను చివరిసారిగా చూడటానికి చాలా మంది సెలబ్రిటీలు, వేలాది మంది ఫ్యాన్స్ పెద్ద ఎత్తున కంఠీరవ స్టేడియానికి తరలి వెళ్తున్నారు. ప్రభుదేవా, నరేశ్, శివ బాలాజీ పునీత్‌కు నివాళి అర్పించారు. టాలీవుడ్ నుంచి జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ పునీత్‌ను కడసారి చూడటానికి బెంగళూరుకు వెళ్తున్నారు. అయితే ఫ్యాన్స్ భారీ సంఖ్యలో వస్తూండటంతో కంఠీరవ స్టేడియానికి 5 కి.మీ.ల దూరం వరకు ట్రాఫిక్ స్తంభించింది.