నాలుగు వారాల తర్వాత బయటకొచ్చిన ఆర్యన్

నాలుగు వారాల తర్వాత బయటకొచ్చిన ఆర్యన్

ముంబై: డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ బాద్‌‌షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ జైలు నుంచి విడుదలయ్యాడు. శుక్రవారం సాయంత్రమే ఆర్యన్ రిలీజ్ కావాల్సింది. కానీ బెయిల్ పేపర్లు సమర్పించడంలో ఆలస్యమవ్వడంతో మరో రాత్రి అతడు జైలులో గడపాల్సి వచ్చింది. కాగా, బాంబై హైకోర్టు ఆర్యన్‌కు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. ఆర్యన్‌తోపాటు అరెస్ట్ అయిన అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేజాలకూ కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇకపోతే, ఎన్‌డీపీఎస్ కోర్టు అనుమతి లేకుండా ఆర్యన్ దేశం విడిచి వెళ్లకూడదని హైకోర్టు స్పష్టం చేసింది. అతడు తన పాస్‌పోర్ట్‌ను వెంటనే తమ ఎదుట సమర్పించాలని ఆదేశించింది. షరతులను ఉల్లంఘిస్తే ఆర్యన్ బెయిల్‌ రద్దును కోరొచ్చని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరోకు కోర్టు తెలిపింది. 

మరిన్ని వార్తల కోసం: 

కౌశిక్ రెడ్డి హల్‌చల్.. నేను ఎక్కడైనా తిరగొచ్చు

భర్తకు వీడియో కాల్ చేసి ఉరివేసుకున్న భార్య

పెన్షన్లు కేసీఆర్ తన ఇంట్ల నుంచి ఇస్తలేడు