న్యూఢిల్లీ, వెలుగు: హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్ – చెన్నై హైస్పీడ్ కారిడార్ల అలైన్‌మెంట్లకు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి.. కన్సల్టెంట్ సంస్థకు పలు సూచనలు చేశారు. ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన హైస్పీడ్ రైలు కారిడార్ల నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్ తయారీ బాధ్యతను రైల్వే శాఖ ఆర్ఐటీఈఎస్ కన్సల్టెన్సీ సంస్థకు అప్పజెప్పింది.
ఆ సంస్థ ప్రతినిధులు ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసంలో ఇందుకు సంబంధించిన పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అలైన్‌మెంట్లు, డీపీఆర్‌కు సంబంధించి వారు చేసిన ప్రతిపాదనలను పరిశీలించిన సీఎం పలు సలహాలు, సూచనలు చేశారు.
