సింహాన్ని పరిగెత్తించిన గ్రామ సింహం

సింహాన్ని పరిగెత్తించిన గ్రామ సింహం

సింహం అనే పేరు వినగానే ఎవరికైనా భయం పుడుతుంది. ఇక ప్రత్యక్ష్యంగా చూస్తే.. వారి పరిస్థితి ఏంటనేది ఊహించుకోవడం కష్టం. అయితే సింహాన్ని ఎదురుగా చూసిన ఓ కుక్క మాత్రం..ఏమాత్రం భయపడకపోగా..దాన్ని ఎదిరిస్తూ మీదకు దూకింది. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తనకు ఎదురుగా వచ్చిన సింహాన్ని చూసిన ఓ గ్రామ సింహం అరుస్తూ దాని వెంట పడింది. అంతేకాదు.. దానిపై దాడి చేసింది. అయితే  కారణం ఏమిటో తెలియదు కానీ.. సింహం మాత్రం ఆ కుక్క నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ వీడియోను చూసిన  నెటిజన్లు మాత్రం ఆశ్యర్య పోతున్నారు.ఇది నిజమేనా.. అసలేం జరుగుతోందంటూ సరదాగా కామెంట్‌ చేస్తున్నారు. 

 ఈ ఫన్నీ వీడియోను ఐఎఫ్‌ఎస్‌ అధికారి సుశాంత నంద ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ అధికారి అడవి జంతువులకు సంబంధించిన వీడియోలను తరచూ పోస్ట్‌ చేస్తుంటారు. 

https://twitter.com/susantananda3/status/1453758098322034693