దేశవ్యాప్తంగా 12,781 కొత్త కేసులు

 దేశవ్యాప్తంగా 12,781 కొత్త కేసులు

దేశంలో మరోసారి  12 వేలకు పైగా  కొత్త కేసులొచ్చాయి.  కొత్తగా  12 వేల 781  కొవిడ్ కేసులు రాగా, 18 మంది  వైరస్ బారిన పడి  చనిపోయారు. మొత్తం  కేసుల్లో  మహారాష్ట్ర నుంచి  4 వేల కేసులు,  కేరళ నుంచి 2వేల  7 వందల  కేసులు, ఢిల్లీ నుంచి  15 వందలకు పైగా  కేసులు నమోదయ్యాయి.  నాలుగు నెలల  గరిష్ఠానికి  వీక్లీ  పాజిటివిటీ రేటు  చేరింది. డైలీ  పాజిటివిటీ రేటు 4.32  శాతానికి పెరగగా..  వీక్లీ పాజిటివిటీ  రేటు  2.62 శాతానికి  ఎగబాకింది. గత వారం రోజుల్లో  80 వేలకు పైగా  కేసులు నమోదయ్యాయి. మరోవైపు  దేశంలో యాక్టివ్  కేసులు భారీగా పెరుగుతున్నాయి.  దేశంలో  ప్రస్తుతం  76 వేల 7 వందల  యాక్టివ్ కేసులున్నాయి.  ఇప్పటివరకు 196  కోట్లకు పైగా  టీకా డోసులు  పంపిణీ చేసినట్లు  ప్రకటించింది కేంద్రం.