దేశంలో క్రమంగా పెరుగుతున్న రోజువారీ కరోనా కేసులు

దేశంలో  క్రమంగా పెరుగుతున్న  రోజువారీ కరోనా కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి ఇంకా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 15, 754  కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య  4,43,14,618కి చేరుకుంది. ఇందులో 4,36,85,535 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. అటు 24 గంటల్లో 47 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య  5,27,253 కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 1,01,830 యాక్టివ్ కేసులున్నాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 3.47 శాతంగా ,రికవరీ రేటు 98.58 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ రాష్ట్రల నుంచి అత్యధికంగా కేసులు వస్తున్నాయి. మహారాష్ట్రలో  2246, కర్నాటకలో 2329, ఢిల్లీలో 1964, కేరళలో 1239 మంది కరోనావైరస్ బారినపడ్డారు. కాగా  ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 209.27 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంనిణీ చేశారు.