న్యూఢిల్లీ : గ్లోబల్ కాంపిటీటివ్ ఇండెక్స్‌లో ఇండియా ర్యాంక్ పడిపోయింది. చాలా ఆర్థిక వ్యవస్థలు తమ స్థానాలను మెరుగుపరుచుకోవడంతో, ఇండియా ర్యాంక్ 10 స్థానాలు కిందకు జారి 68వ ర్యాంక్‌కు పరిమితమైంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్) ఈ గ్లోబల్ కాంపిటీటివ్ ఇండెక్స్ రిపోర్ట్ 2019ను విడుదల చేసింది. ఈ ఇండెక్స్‌లో అమెరికాను సింగపూర్ బీట్ చేసి వరల్డ్‌లో మోస్ట్ కాంపిటీటివ్(అత్యంత పోటీతత్వ) దేశంగా నిలిచింది. హాంకాంగ్ కూడా నాలుగు స్థానాలు పైకి ఎగబాకి, మూడో ర్యాంక్‌ను దక్కించుకుంది. ‘2019లో 10 స్థానాలను కోల్పోయిన ఇండియా 68వ ర్యాంక్‌ను పొందింది. స్కోర్ పాయింట్స్ కాస్త తగ్గడంతో ర్యాంక్ పడిపోయింది. అంతేకాక చాలా దేశాలు ఇండియాకు దగ్గరగా వాటి స్థానాలను మెరుగుపరుచుకున్నాయి’ అని ఇండెక్స్‌లో డబ్ల్యూఈఎఫ్ తెలిపింది. స్థూల ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం, మార్కెట్ సైజులో ఇండియా ఎక్కువ ర్యాంక్‌లనే పొందిందని, కానీ దీని ఫైనాన్సియల్ సెక్టార్ కాస్త తగ్గిందని తాజా ఇండెక్స్ పేర్కొంది.
కార్పొరేట్ గవర్నెన్స్‌లో సూపర్…
కార్పొరేట్ గవర్నెన్స్ విషయంలో ఇండియా 15వ స్థానాన్ని సంపాదించుకుంది. షేర్‌హోల్డర్స్ గవర్నెన్స్‌లో గ్లోబల్‌గా రెండో స్థానంలో నిలిచినట్టు డబ్ల్యూఈఎఫ్ అధ్యయనం తెలిపింది. మార్కెట్ సైజులో ఇండియా మూడో స్థానంలో ఉంది. రెన్యూవబుల్ ఎనర్జీ రెగ్యులేషన్స్ ర్యాంక్‌లో కూడా ఇండియా ఇదే ర్యాంక్‌ను పొందింది. ఇన్నోవేషన్ విషయంలో ఇండియా డెవలప్‌మెంట్ స్టేటస్‌నే పొందింది. చాలా ఎమర్జింగ్ ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే ఈ విషయంలో ఇండియా చాలా ముందున్నట్టు ఇండెక్స్ రిపోర్ట్ తెలిపింది. అయితే ఎన్ని విషయాల్లో ముందున్నా.. పోటీతత్వ విషయంలో కొన్ని కీలక విషయాల్లో మాత్రం ఇండియా వెనుకబడింది. ఐసీటీ(ఇన్‌ఫర్మేషన్, కమ్యూనికేషన్స్, టెక్నాలజీ) అడాప్షన్, ఆరోగ్యకరమైన జీవనం, ఆయుర్ధాయం ఎక్కువ లేకపోవడం వంటి విషయాల్లో మన దేశం వెనకే ఉన్నట్టు డబ్ల్యూఈఎఫ్ చెప్పింది. ఆరోగ్యకరమైన జీవన విధానంలో ఇండెక్స్‌లోని141 దేశాలతో పోలిస్తే.. ఇండియా 109వ ర్యాంక్‌ను పొందింది. నైపుణ్యాల విషయంలో ఇండియా ఇంకా మెరుగుపడాల్సి ఉందని డబ్ల్యూఈఎఫ్ తెలిపింది. వాణిజ్య స్వేచ్ఛ లేకపోవడంతో, ప్రొడక్ట్ మార్కెట్ ఎఫీషియెన్స్ కూడా తక్కువగానే ఉంది. కార్మికుల హక్కుల రక్షణల్లో, కార్మిక మార్కెట్ విధానాల్లో ఇండియా వెనుకబడింది. మహిళల చొరవ కూడా తక్కువగానే ఉంది. మహిళా కార్మికులు, పురుష కార్మికుల రేషియో 0.26గా ఉంది. ఈ విషయంలో మాత్రం ఇండియా చాలా తక్కువ ర్యాంక్‌ను అంటే 128వ స్థానాన్ని పొందింది. స్కిల్స్ విషయంలో ఇండియా 107వ ర్యాంక్‌తోనే సరిపెట్టుకుంది. ఈ ఇండెక్స్‌లో మన పొరుగు దేశాలు శ్రీలంక 84వ స్థానాన్ని, బంగ్లాదేశ్ 105వ ర్యాంక్‌ను, నేపాల్ 108వ ర్యాంక్‌ను, పాకిస్తాన్ 110వ స్థానాన్ని పొందాయి. కొలంబియా, సౌత్ ఆఫ్రికా, టర్కీ వంటి ఆర్థిక వ్యవస్థలు గతేడాది కాలంగా తమ స్థానాలను మెరుగుపరుచుకుని, ఇండియాను బీట్ చేశాయి. అయితే ఈ స్టడీలో పొంచి ఉన్న ఆర్థిక సంక్షోభానికి గ్లోబల్ ఎకానమీ సిద్ధంగా లేదని వెల్లడించింది. గ్లోబల్ కాంపిటీటివ్ ఇండెక్స్‌ను 1979లో ఇండియా లాంచ్ చేసింది. 12 పిల్లర్స్ కిందకు వచ్చే103 ఇండికేటర్స్‌తో 141 ఆర్థిక వ్యవస్థలపై సర్వే చేస్తారు.


