స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు షాక్: ఈ ఏడాది ఎగుమతులు భారీగా తగ్గే ఛాన్స్ !

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు షాక్:  ఈ ఏడాది ఎగుమతులు భారీగా తగ్గే ఛాన్స్ !

న్యూఢిల్లీ: మనదేశం నుంచి స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు 2026లో 10 నుంచి 12 శాతం తగ్గే అవకాశం ఉందని మార్కెట్ పరిశోధన సంస్థ  సైబర్‌ మీడియా రీసెర్చ్ ( సీఎంఆర్) నివేదిక వెల్లడించింది. మెమరీ చిప్‌ల ధరలు పెరగడం వల్ల ఫోన్ల ధరలు పెరిగి డిమాండ్ తగ్గడమే దీనికి ప్రధాన కారణం. మొదటి క్వార్టర్​లో స్మార్ట్​ఫోన్ మార్కెట్ రెండు శాతం పతనమయింది. వీవో 21 శాతం మార్కెట్ వాటాతో మొదటిస్థానంలో నిలిచింది. 

శామ్​సంగ్ 17 శాతం, ఒప్పో 14 శాతం వాటాతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. యాపిల్ ఎగుమతులు 6 శాతం పెరిగాయి. ఇది తొమ్మిది శాతం వాటాను దక్కించుకుంది. ఐఫోన్ 16, ఐఫోన్ 17 మోడళ్లకు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రీమియం విభాగంలో ధరల పెరుగుదల ప్రభావం తక్కువగా ఉంది. ఫీచర్ ఫోన్ విభాగంలో ఐటెల్ మొబైల్ 35 శాతం వాటాతో ముందుంది. చిప్‌సెట్ మార్కెట్​లో మీడియాటెక్ 48 శాతం వాటాతో టాప్​లో కొనసాగుతోంది.