ఇండియా టుడే సర్వే: ముందంజలో SP-BSP కూటమి

ఇండియా టుడే సర్వే: ముందంజలో SP-BSP కూటమి

త్వరలో జరగబోయే సాదారణ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాలు దక్కించుకుంటుందనే విషయంపై ఇండియా టుడే సర్వే నిర్వహించింది. సమాజ్‌వాదీ-బహుజన్‌ సమాజ్‌ పార్టీ కూటమి 40 MP స్థానాలు గెలుచుకుంటుందని సర్వేలో తేలింది. దేశంలో ఎక్కువ లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో SP-BSP కూటమితో అధికార భారతీయ జనతా పార్టీ తీవ్రంగా నష్టపోనుందని సర్వేలో స్పష్టమైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఉత్తర ప్రదేశ్‌లోని 80 సీట్లలో 71 సీట్లు గెలుచుకుంది. ఆ సమయంలో ఒంటరిగా పోటీ చేసిన BSP మాత్రం ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. SP కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసి.. 7 స్థానాలు దక్కించుకోగా, కాంగ్రెస్‌కి మాత్రం కేవలం రెండు స్థానాల్లో విజయం లభించింది. కాగా BJPని ఎదుర్కోడానికి ఈసారి SP-BSP లు కలిసి బరిలోకి దిగాయి. దీంతో BJP భారీగా నష్టపోనుందని పలు సర్వేలు తెలిపాయి.

అయితే ఇండియా టుడే చేసిన సర్వే ప్రకారం SP-BSP కూటమికి 40 స్థానాలు వస్తాయని సర్వేలో తేలింది. ఓట్‌ షేరింగ్‌లో కూడా కూటమే 35 స్థానాల అనుకూలతతో ముందంజలో ఉందని, BJPకి కేవలం 27 స్థానాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. గత ఎన్నికల కంటే 36 స్థానాలు తక్కువగా ఈసారి 35 స్థానాలు మాత్రమే BJP దక్కించుకుంటుందని చెప్పింది. ఇతర పార్టీల గురించి తెలియజేస్తూ.. RLDకి ఒక స్థానం, కాంగ్రెస్‌కు నాలుగు స్థానాలు వస్తాయని ఇండియా టుడే సర్వే  తెలిపింది.