
హైదరాబాద్, వెలుగు: ప్రధాని మోదీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని కాంగ్రెస్ నేత జి.నిరంజన్ ఈసీకి కంప్లైంట్ చేశారు. గురువారం బీఆర్కే భవన్లో సీఈఓ వికాస్ రాజ్‌కు ఆయన ఫిర్యాదు చేశారు. వరంగల్ జిల్లా ఎన్నికల ప్రచారంలో భాగంగా.. మోదీ చిన్నపిల్లను తన చేతుల్లోకి ఎత్తుకుని క్యాంపెయినింగ్ చేసి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్నారు. ఈ నెల 6న మామునూరు ఎయిర్పోర్ట్ నుంచి.. వరంగల్‌లో పబ్లిక్ మీటింగ్‌కు వెళ్తూ.. లక్ష్మీపురంలో ఆగి చిన్న పిల్లను ఎత్తుకున్నారన్నారు. ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు ఆ వీడియోను వైరల్ చేశారన్నారు. ఎన్నికల కమిషన్ రిలీజ్ చేసిన నిబంధనల ప్రకారం ప్రధానిపై చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో కోరారు.