ఔత్సాహికులకు హెచ్ సీఏ ఆహ్వానం

ఔత్సాహికులకు హెచ్ సీఏ ఆహ్వానం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఔత్సాహిక అంపైర్లు, స్కోరర్లు, క్యూరేటర్లకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఏ) అద్భుత అవకాశం కల్పిస్తోంది. అర్హులకు బిగినర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెవనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోర్సులో శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. అంపైర్లు, స్కోరర్లు, క్యూరేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పని చేసేందుకు ఆసక్తి ఉన్నవారు ఈ నెల14వ తేదీ లోపు జింఖానా గ్రౌండ్​లోని హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఏ ఆఫీసులో అప్లికేషన్లు అందజేయాలని హెచ్ సీఏ కార్యదర్శి ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.దేవరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూచించారు. ప్రతి విభాగంలో(స్కోరర్లు, అంపైర్లు, క్యూరేటర్లు) 25 మంది ఉత్తమ అభ్యర్థులను ఎంపిక చేసి హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఏ ఆధ్వర్యంలో నిపుణుల చేత బిగినర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెవల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శిక్షణ ఇస్తామని తెలిపారు.

‘క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై మంచి అవగాహన, మంచి కంటిచూపు, కనీసం ఇంటర్మీడియట్ పూర్తిచేసిన 18 నుంచి 40 ఏండ్ల లోపు వయస్సున్నవారు అర్హులు. మాజీ క్రికెటర్లకు ఎంపికలో తొలి ప్రాధాన్యత ఉంటుంది. పూర్తి వివరాలకు హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఏ అధికారిక వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (hycricket.org)ను చూడొచ్చు.’ అని చెప్పారు. అలాగే బీసీసీఐ నిబంధనల ప్రకారం విదేశీ పౌరసత్వం కలిగిన వారెవరైనా దేశవాళీ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పోటీపడేందుకు అనర్హులని దేవ్ రాజ్ తెలిపారు. ఓవర్సీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిటిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా, పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆరిజిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డులు కలిగి ఉన్నవారు సైతం విదేశీ పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు వదులుకోకుంటే.. దేశవాళీ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆడేందుకు అర్హత సాధించలేరని చెప్పారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.