
బషీర్ బాగ్/సికింద్రాబాద్, వెలుగు: ఎల్బీస్టేడియంలో శుక్రవారం జరగనున్న ప్రధాని మోదీ సభ తెలంగాణకు ఎంతో కీలకమైనదని సికింద్రాబాద్బీజేపీ ఎంపీ అభ్యర్థి జి.కిషన్ రెడ్డి చెప్పారు. బీజేపీ ఈసారి రాష్ట్రంలో డబుల్ డిజిట్ఎంపీ స్థానాలు గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి, కేసీఆర్ మాటలను జనం నమ్మే స్థితిలో లేరని చెప్పారు. గురువారం ఎల్బీ స్టేడియంలో చేస్తున్న సభ ఏర్పాట్లను పార్టీ నేతలు కె.లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డితో కలిసి కిషన్‌రెడ్డి పరిశీలించారు. అలాగే తార్నాక నుంచి మెట్టుగూడ, అడ్డగుట్ట. సీతాఫల్‌మండీ, వారసుగూడ వరకు కిషన్‌రెడ్డి ర్యాలీ నిర్వహించారు.