రాజేంద్రనగర్ లో హిట్ అండ్ రన్ ప్రమాదంలో ఓ కానిస్టేబుల్ మృతిచెందారు. మంగళవారం( డిసెబర్ 23) అత్తాపూర్ పరిధిలోని ఉప్పర్ పల్లి పిల్లర్ నంబర్ 191 దగ్గర కానిస్టేబుల్ ను డీసీఎం ఢీకొట్టింది.. దీంతో కానిస్టేబుల్ అబ్డుల్ సత్తార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రున్ని పట్టించుకోకుండా డ్రైవర్ డీసీఎంను వేగంగా నడుపుతూ పరారయ్యాడు. ప్రమాదం తర్వాత ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
బోయిన్ పల్లి కూరగాయల మార్కెట్లో అన్ లోడ్ చేసి వెళ్తున్న డీసీఎం... అత్తాపూర్ పిల్లర్ నంబరు 191 దగ్గర కానిస్టేబుల్ అబ్దుల్ సత్తార్ ను ఢీకొట్టింది. టోలీచౌకి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న సత్తార్ డ్యూటీ దిగి హసన్ నగర్ లోని తన ఇంటికి వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. అబ్దుల్ సత్తార్ స్పాట్ లోనే చనిపోయాడు. యాక్సిడెంట్ ను చూసిన స్థానికులు, వాహనదారులు డీసీఎంను వెంబడించి పట్టుకున్నారు. డ్రైవర్ ను పోలీసులకు అప్పజెప్పారు.
►ALSO READ | హైదరాబాదీలు బీ అలర్ట్ : డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసుల స్పెషల్ ఫోకస్.. పట్టుబడితే జైలే..!
