వాట్సాప్ యూజర్లకు వార్నింగ్ : మీ ప్రైవేట్ మెసేజ్‌లను హ్యాకర్లు సైలెంటుగా చూస్తుండొచ్చు...

 వాట్సాప్ యూజర్లకు వార్నింగ్ : మీ ప్రైవేట్ మెసేజ్‌లను హ్యాకర్లు సైలెంటుగా చూస్తుండొచ్చు...

మెటా యాజమాన్యంలోని WhatsApp యూజర్లను  టార్గెట్  చేసుకుని సరికొత్త సైబర్ దాడి వెలుగులోకి వచ్చింది. 'GhostPairing' దాడి తర్వాత ఇప్పుడు లోటస్‌బెయిల్(LotusBail ) అనే ప్రమాదకరమైన మాల్వేర్ సాఫ్ట్‌వేర్ కలకలం రేపుతోంది. ఇది వాట్సాప్ వెబ్ APIలా వ్యవహరిస్తూ యూజర్ల వ్యక్తిగత డేటాను దొంగిలిస్తోంది.

 సైబర్ సెక్యూరిటీ పరిశోధకుల ప్రకారం హ్యాకర్లు NPM (Node Package Manager)లో ఒక హానికరమైన ప్యాకేజీని ప్రవేశపెట్టారు. ఇది  ఓపెన్-సోర్స్ లైబ్రరీ 'Baileys' లాగే కనిపిస్తుంది. చాలామంది దీనిని నిజమైనదని భావించి ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు. గత ఆరు నెలల్లోనే  56వేలకి పైగా డౌన్‌లోడ్లు జరిగాయి. 

 ఒకసారి ఈ మాల్వేర్ మీ ఫోన్ లోకి చేరితే   మీరు పంపే, మీకు వచ్చే ప్రతి మెసేజ్ హ్యాకర్ల సర్వర్‌కు చేరుతుంది. మీ కాంటాక్ట్ లిస్టు, మీడియా ఫైల్స్,  డాక్యుమెంట్‌లను హ్యాకర్లు కాపీ చేయవచ్చు. మీ వాట్సాప్ లాగిన్,  వివరాలు దొంగిలించి మీ అకౌంట్ వారి కంట్రోల్లోకి తీసుకుంటారు.

ALSO READ : లాస్ ఏంజిల్స్‌లో ఘోర కారు ప్రమాదం

 వాట్సాప్ 'లింక్డ్ డివైసెస్' ఫీచర్‌ను ఉపయోగించి హ్యాకర్లు వారి సిస్టంకి మీ అకౌంట్ సీక్రెట్ గా లింక్ చేస్తారు. మీరు ఈ మాల్వేర్‌ను డిలీట్ చేసినా పోదు. 

 మీ వాట్సాప్ అకౌంట్ సురక్షితంగా ఉండాలంటే మీ వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి Linked Devices ఆప్షన్ చూడండి. అక్కడ మీకు తెలియని డివైజెస్ ఏవైనా కనిపిస్తే వెంటనే 'Log Out' చేయండి.

డిస్కౌంట్స్  లేదా బంపర్ ఆఫర్లతో వచ్చే గుర్తు తెలియని మెసేజెస్ క్లిక్ చేయకండి. మీ వాట్సాప్ అకౌంట్ అధిక భద్రత కోసం తప్పనిసరిగా టూ-స్టెప్ వెరిఫికేషన్‌ను ఎనేబుల్ చేసుకోండి.