లాస్ ఏంజిల్స్‌లో ఘోర కారు ప్రమాదం: కాల్ ఆఫ్ డ్యూటీ సృష్టికర్త విన్స్ జాంపెల్లా మృతి...

  లాస్ ఏంజిల్స్‌లో ఘోర కారు ప్రమాదం: కాల్ ఆఫ్ డ్యూటీ సృష్టికర్త విన్స్ జాంపెల్లా మృతి...

కాల్ ఆఫ్ డ్యూటీ వీడియో గేమ్ సిరీస్ సృష్టికర్త విన్స్ జాంపెల్లా(55 ) దక్షిణ కాలిఫోర్నియాలోని ఏంజిల్స్ క్రెస్ట్ హైవేపై ఫెరారీ 296 GTS కారు  అదుపుతప్పి  ఢీకొనడంతో మరణించాడు. ఈ ప్రమాదం ఆదివారం జరగగా.. ప్రమాదానికి సంబంధించిన వీడియో మంగళవారం ఉదయం బయటపడింది.

ఈ వైరల్ వీడియోలో  విన్స్ జాంపెల్లా ఉన్న  రెడ్ కలర్ ఫెరారీ కారు  ఓ సొరంగం నుండి బయటకు రాగానే  కాంక్రీట్ పిల్లర్ ని   ఢీకొట్టడం కారు నుజ్జునుజ్జు అయ్యి మంటలు చెలరేగాయి. అయితే  కారు ప్రమాదం ఒక్కసారిగా తీవ్రంగా జరగటంతో  విన్స్  జాంపెల్లా అక్కడికక్కడే మరణించారు. 

కారులో కూర్చున్న మరొక వ్యక్తి చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించారు. రెస్పాన్ ఎంటర్‌టైన్‌మెంట్ యాజమాన్యంలోని ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ విన్స్ జాంపెల్లా మరణాన్ని ప్రకటించింది. రెస్పాన్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను విన్స్ జాంపెల్లా  స్థాపించారు.

ALSO READ : నేవీ ఆధిపత్యానికి అమెరికా కొత్త ప్లాన్..

 అయితే  విన్స్ జాంపెల్లా కారు నడుపుతున్నారా లేదా అతనితో ప్రయాణిస్తున్న మరొక వ్యక్తి నడుపుతున్నాడ అనేది ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదు. జాంపెల్లా 2003లో జాసన్ వెస్ట్ & గ్రాంట్ కొలియర్‌లతో కలిసి కాల్ ఆఫ్ డ్యూటీని సృష్టించాడు.