అల్వాల్ లో విషాదం.. చార్మినార్ ఏసీపీ చంద్రశేఖర్ భార్య ఆత్మహత్య..అసలేం జరిగింది?

అల్వాల్ లో విషాదం..  చార్మినార్ ఏసీపీ చంద్రశేఖర్ భార్య ఆత్మహత్య..అసలేం జరిగింది?

హైదరాబాద్  నగరంలోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చార్మినార్ డివిజన్ ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ భార్య హేమలత (48) అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.

పోలీసుల సమాచారం ప్రకారం.. చంద్రశేఖర్, హేమలత దంపతులు అల్వాల్ పరిధిలోని బృందావన కాలనీలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో జులై 12న ఈరోజు హేమలత తన ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న అల్వాల్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. 

 మృతదేహాన్ని  పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆమె మరణానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కుటుంబ కలహాలా? లేక మరేదైనా ఆరోగ్య సమస్యలా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.