అయోధ్య రామాలయం నిధుల చోరీ కేసులో సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ. ఈ కేసులో అసలు నేరస్థులను అటు ప్రభుత్వం, ఇటు అధికారులు కాపాడుతున్నారని ఆరోపించారు. ఈ విషయంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
పవిత్ర రామాలయాన్ని దోచుకున్న కేసులో అరెస్ట్ అయిన 8మంది చిన్న చేపలు మాత్రమే.. తిమింగలాలు వేరే ఉన్నాయి. అసలైన దోషులను కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, అధికార యంత్రాంగం కాపాడుతున్నాయని అన్నారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని డిమాండ చేశారు.
బీజేపీ, వీహెచ్ పీలు సామాన్య హిందూ భక్తులను ఎలా మోసం చేస్తున్నారో మొదటి నుంచి చూస్తూ వస్తున్నారు. 1980లో రామజన్మభూమి ఉద్యమంలో సామాన్య హిందూ భక్తులను వీహెచ్ పీ, బీజేపీలు ఎలా మోసం చేశారో చూశాను. 2024లో ఆలయ ప్రారంభోత్సవం జరిగినప్పుడు అదే స్థాయిలో మోసం జరిగింది. వేద గ్రంథాలకు, హిందూ శాస్త్రాలకు విరుద్ధంగా ఆలయం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగిందన్నారు. దీంతో శంకరాచార్యులు ఆ కార్యక్రమాన్ని బహిష్కరించారని అన్నారు. ఇప్పుడు విశ్వాసం పేరుతో సామాన్య ప్రజలను ఎలా మోసం చేస్తున్నారనే వాస్తవం ప్రజల్లోకి వస్తోంది’’ అని కాంగ్రెస్ ఎంపీ తివారీ అన్నారు.
అయోధ్యరామాలయం లక్షలాది మంది భారతీయుల విశ్వాసం, భక్తి, సాంస్కృతిక చైతన్యానికి ప్రతీకగా నిలుస్తుంది.. ఆలయ విరాళాలు, వాటినిర్వహణ, పరిపాలనా విధానాలపై తీవ్ర ఆరోపణలు వస్తున్న క్రమంలో ప్రజలకు జవాబుదారీతనం చూపించాల్సిన బాధ్యత ఉందన్నారు ప్రమోద్ తివారీ.
