మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, లారీ ఢీకొని ఇద్దరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆదివారం (జులై 12) రాత్రి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బండమీదిపల్లి (ఆర్టీవో ఆఫీసు) సమీపంలోని టర్నింగ్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
