నేను ఉన్నప్పుడే నెంబర్ 1.. టీడీపీ, జనసేనది తప్పుడు ప్రచారం : జగన్

నేను ఉన్నప్పుడే నెంబర్ 1.. టీడీపీ, జనసేనది తప్పుడు ప్రచారం : జగన్

పారిశ్రామిక తయారీ రంగం.. అంటే మ్యానిఫ్యాక్చరింగ్ రంగంలో 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉందంటూ డేటాతో సహా Xలో పోస్ట్ చేశారు మాజీ సీఎం జగన్. నా హయాంలోనే తయారీ రంగంలో దక్షిణ భారతదేశంలో ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉంటే.. దేశ వ్యాప్తంగా 5వ స్థానంలో ఉందని.. అదే విధంగా పరిశ్రమల రంగం.. ఇండస్ట్రీ సెక్టార్ వృద్ధిలో దక్షిణ భారతదేశంలోనే ఏపీ నెంబర్ వన్ లో ఉంటే.. దేశ వ్యాప్తంగా 8వ స్థానంలో ఉందంటూ పోస్ట్ చేశారు మాజీ సీఎం జగన్.

అధికార కూటమి పార్టీలు టీడీపీ, జనసేనపై మండిపడ్డారు వైసీపీ అధినేత జగన్. మంగళవారం ( డిసెంబర్ 23 ) ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ లో ఇరుపార్టీలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేన పార్టీలు ఎన్నిక‌ల ముందు, ఇప్పుడూ ప‌నిక‌ట్టుకుని వైసీపీపై విష ప్ర‌చారం చేస్తున్నాయని అన్నారు జగన్. వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో ఏపీ బ్రాండ్ పూర్తిగా దెబ్బ‌తింద‌ని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని.. తాను ఉన్నప్పుడే ఏపీ నంబర్ 1 గా ఉండేదని అన్నారు జగన్. 

వైసీపీ హయాంలో పెట్టుబ‌డిదారులు రాష్ట్రాన్ని వ‌దిలివెళ్లిపోయార‌ని టీడీపీ, జనసేన పార్టీలు తప్పుడు విమ‌ర్శ‌లు చేస్తున్నాయని అన్నారు. అంతేకాదు జగన్ హ‌యాంలో ఎలాంటి ప‌రిశ్ర‌మ‌లు రాలేద‌ని, పారిశ్రామిక అభివృద్ధి జ‌ర‌గ‌లేద‌ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లు సంద‌ర్భం అయిన‌ప్ప‌టికీ, కాన‌ప్ప‌టికీ విమ‌ర్శ‌లు చేస్తూనే ఉన్నారని, రాష్ట్రం అధోగ‌తి పాలైన‌ట్లుగా మాట్లాడుతున్నారని అన్నారు జగన్.

అయితే 2019-24 మ‌ధ్య వాళ్లు చెబుతున్న‌ది నిజం అయి ఉంటే పారిశ్రామిక అభివృద్ధి జ‌రిగి ఉండేది కాదు క‌దా. వాస్త‌వాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయంటూ డేటాను పోస్ట్ చేశారు జగన్.

►ALSO READ | ఉత్తరాంధ్రపై చంద్రబాబు కన్ను పడింది.. భూములు దోచుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు: ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ 

వైసీపీ హయాంలో తయారీ రంగం వృద్ధిలో దక్షిణ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ నంబర్-1గా ఎదిగిందని.. దేశవ్యాప్తంగా – నంబర్ 5లో ఉందని అన్నారు జగన్. 
పరిశ్రమల రంగం వృద్ధిలోదక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ – నంబర్ 1, దేశవ్యాప్తంగా – నంబర్ 8లో ఉంది. 

ఇప్పుడు చెప్పండి 2019-24 మ‌ధ్య‌లో ఏపీ బ్రాండ్ దెబ్బ‌తిందా? లేక‌పోతే ఇంత‌కుముందు ఎప్పుడూ చూడ‌ని పురోగ‌తిని చూశామా?  మీరే చెప్పండంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు జగన్