పాడుబడ్డ ఇంట్లో పెద్దపులి... గాండ్రింపుల ధాటికి వణుకుతున్న జనం..

పాడుబడ్డ ఇంట్లో పెద్దపులి... గాండ్రింపుల ధాటికి వణుకుతున్న జనం..

ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా ప్రజలను వణికిస్తోంది పెద్దపులి. పెద్దపులి ధాటికి గత ఐదు రోజులుగా కంటి కునుకు లేకుండా అల్లాడిపోతున్నారు ప్రజలు. రోజుకో గ్రామానికి వెళ్తూ.. పశువులపై దాడి చేస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు జిల్లా వాసులు. నిద్ర మానుకొని కాపలా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని అంటున్నారు. 

గురువారం ( ఫిబ్రవరి 6 ) రాయవరం మండలం కూర్మాపురంలో పాడుబడ్డ ఇంట్లో చొరబడి కలకాలం రేపింది పెద్దపులి. పాడుబడ్డ ఇంట్లో నుంచి పులి గాండ్రింపులు వినబడుతుండటంతో భయంతో వణికిపోతున్నారు స్థానికులు.

►ALSO READ | బాత్‌రూమ్‌లు క్లీన్ చేసే కెమికల్స్‌తో తిరుమల లడ్డూ తయారుచేశారు: సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన అటవీ సిబ్బంది పులికి మత్తు మందు ఇచ్చి బంధించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పాడుబడ్డ ఇంటి బయట బోనులు, గన్స్ తో సిద్ధంగా ఉన్నారు అటవీ సిబ్బంది, పోలీసులు. ఇదిలా ఉండగా.. కూర్మాపురం పరిసర ప్రాంతాల్లో పెద్దఫులి పాదముద్రలు గుర్తించారు అటవీ సిబ్బంది. కేశవరం ప్రాంతంలో కూడా పెద్దపులి కోసం గాలిస్తున్నారు సిబ్బంది. 

బుధవారం రాజానగరంలోని పుణ్యక్షేత్రం, జి. ఎర్రపాలెం గ్రామాల్లో మూడు ఆవులు, ఒక దూడను చంపింది పెద్దపులి.మంగళవారం రఘునాథపురంలో పశువుపై దాడి చేసి చంపేసింది. అంతే కాకుండా పామాయిల్ తోటల్లో మరో మూడు ఆవులు, ఒక దూడను చంపినట్లు నిర్దారించారు అటవీశాఖ అధికారులు.