ఉత్తరాంధ్రపై చంద్రబాబు కన్ను పడింది.. భూములు దోచుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు: ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ 

ఉత్తరాంధ్రపై చంద్రబాబు కన్ను పడింది.. భూములు దోచుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు: ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ 

సీఎం చంద్రబాబుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. మంగళవారం ( డిసెంబర్ 23 ) మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఈమేరకు వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్రపై సీఎం చంద్రబాబు, ఆయన టీం కన్ను పడిందని.. భూములు దోచుకుందామని చుస్తున్నారని అన్నారు బొత్స. రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు ఇవ్వడం ఎక్కడైనా ఉందా అంటూ ప్రశ్నించారు బొత్స. ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలవకుండా..కేటాయింపులు ఎప్పుడైనా జరిగాయా అని అన్నారు.

భూ కేటాయింపులు అన్నీ తిరగదోడుతామని.. భూ కేటాయింపులపై న్యాయ పోరాటం చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ఇన్ని అరాచకాలు జరుగుతుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు బొత్స. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్ లకు పేదలు అవసరం లేదని అన్నారు. గోదావరి జిల్లాల్లో ఎక్కడ చూసినా పేకాట క్లబ్బులు, పోర్టుల్లో అక్రమ రవాణా జరుగుతోందని అన్నారు. రాష్ట్రంలో ఉన్నది ఎన్డీయే ప్రభుత్వమా లేక వైసీపీ ప్రభుత్వమా అని సీఎం చంద్రబాబును ప్రశ్నిస్తున్నానని అన్నారు బొత్స.

►ALSO READ | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి వివేక్ , ఎంపీ వంశీకృష్ణ

వైసీపీ నేతలు తప్పు చేసుంటే చర్యలు తీసుకోకుండా ఎందుకు వెనకాడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రతిరోజు అత్యాచారమో, హత్య, కిడ్నాప్ ఇలా ఎదో ఒక సమస్యం చూస్తూనే ఉన్నామని అన్నారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పు చేసిందని.. ఆ డబ్బంతా ఏం చేశారంటే సమాధానం లేదని అన్నారు బొత్స.