తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి కుటుంబ సభ్యులు. డిసెంబర్ 23న ఉదయం శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి,ఎంపీ వంశీ కృష్ణ. దర్శనం అనంతం ఆలయ రంగనాయక మంటపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం ఇవ్వగా ఆలయ అధికారులు శేష వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి వివేక్ వెంకటస్వామి. మారుమూల ప్రాంతాల్లో ఉపాధి కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం మహాత్మాగాంధీ పేరుతో పనులు ప్రారంభించింది. బీజేపీ ప్రభుత్వం పేరు మార్చి కేంద్రం నుంచి వచ్చే 90 శాతం దాన్ని 60 శాతం చేసింది. నేను ఎంపీగా ఉన్నప్పుడు కేంద్రంలో 16 లక్షల కోట్ల రెవిన్యూ ఉండేది. ప్రస్తుతం 40 లక్షల కోట్ల అయ్యింది. అన్నింటి పై 18 శాతం జీఎస్టీ వేయడం, కేంద్ర ప్రభుత్వ ఆదాయం పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎఫ్ఆర్ బీఎమ్(Fiscal Responsibility and Budget Management) కేంద్రం ప్రారంభించిన తరువాత ఆర్థిక పరిస్థితి రాష్ట్రాల్లో బాగోలేదు. రాష్ట్రాలు 40 శాతం ఇవ్వలాంటే మారుమూల గ్రామాల్లో ఉద్యోగాలు ఎలా వస్తాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మ గాంధీ పేరు మార్చడం సరైంది కాదు. మారుమూల ప్రాంతాల్లో ప్రజలు ఇదే చెప్తున్నారు. 100 రోజుల కూలి భద్రత ఉండేదాన్ని.. చాల రాష్ట్రాలు ఇచ్చే పరిస్థితి లేదు. దాన్ని పున పరిశీలన చేయాలని కోరుతున్నాం అని అన్నారు.
