Rajinikanth: నరసింహ పాత్రలో శివన్న విశ్వరూపం.. ఈసారి 'జైలర్ 2' లో మరింత పవర్‌ఫుల్‌గా!

Rajinikanth: నరసింహ పాత్రలో శివన్న విశ్వరూపం.. ఈసారి 'జైలర్ 2' లో మరింత పవర్‌ఫుల్‌గా!

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్' మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే.  నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దాదాపు రూ. 600 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'జైలర్ 2' వస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే లేటెస్ట్ గా ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి కన్నడ సెన్సేషన్, హ్యాట్రిక్ హీరో శివ రాజ్‌కుమార్ తన పాత్రపై ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.

నరసింహ పాత్రలో శివన్న విశ్వరూపం!

'జైలర్' మొదటి భాగంలో శివ రాజ్‌కుమార్ పోషించిన 'నరసింహ' పాత్ర కేవలం కొన్ని నిమిషాలే ఉన్నా.. అది సినిమా ఫలితాన్నే మార్చేసింది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో రజనీకాంత్, శివన్న కలిసి సిగరెట్ వెలిగించే సీన్ థియేటర్లలో పూనకాలు తెప్పించింది. సీక్వెల్‌లో ఈ పాత్ర ఎలా ఉండబోతోంది అన్నదానిపై శివన్న స్పందిస్తూ.. "జైలర్ 2లో నా పాత్ర మొదటి భాగం కంటే చాలా పవర్‌ఫుల్‌గా, లెంగ్తీగా ఉండబోతోంది. ఇది కేవలం అతిథి పాత్ర కాదు, కథను మలుపు తిప్పే ఒక కీలకమైన 'లాంగ్ కామియో'. ఈ వారం నుండే నేను షూటింగ్‌లో పాల్గొంటున్నాను. జనవరి రెండో వారంలో మరికొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తాం అని వెల్లడించారు.

భారీ తారాగణం.. అదే మ్యాజిక్!

 'జైలర్ 2'లో కేవలం శివ రాజ్‌కుమార్ మాత్రమే కాదు, ఇండియన్ సినిమాలోని దిగ్గజాలు మళ్లీ ఒకే స్క్రీన్‌పై కనిపించబోతున్నారు. 'విజయ్ సేతుపతి ఈ సీక్వెల్‌లో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే గోవా షెడ్యూల్‌లో ఆయన పాల్గొన్నట్లు సమాచారం.మొదటి భాగం తరహాలోనే మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్ కూడా ఈ సీక్వెల్‌లో తమ పాత్రలను కొనసాగించనున్నారు. ముత్తువేల్ పాండియన్ భార్యగా రమ్యకృష్ణ మరోసారి తన నటనతో అలరించనున్నారు. 

ALSO READ : రెండు గంటల పాటు సాగిన సీఐడీ విచారణ..

మరో వైపు  నందమూరి బాలకృష్ణ ఈ సినిమాలో కనిపిస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. అయితే మేకర్స్ దీనిపై ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఒకవేళ బాలయ్య కూడా తోడైతే సౌత్ ఇండియా బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం అంటున్నారు అభిమానులు. నెల్సన్ తన మార్క్ కామెడీని మిస్ చేయకుండా ఉండటానికి ఈసారి కామెడీ కింగ్ సంతానాన్ని కూడా బరిలోకి దించుతున్నారు.

రిలీజ్ డేట్ ఖరారు!

 ఈ సినిమా జూన్ 12, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుందని రజనీకాంత్ స్వయంగా ప్రకటించారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి అదిరిపోయే సంగీతాన్ని అందిస్తుండగా, సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ప్రస్తుతం శివ రాజ్‌కుమార్ తన సొంత చిత్రం '45' ప్రమోషన్లలో భాగంగా ఈ విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే కన్నడ సినిమాల్లో కూడా త్వరలో ఇతర భాషల స్టార్ హీరోల అతిథి పాత్రలను చూస్తారని ఆయన హింట్ ఇచ్చారు. 'జైలర్ 2'తో రజనీ-శివన్న-మోహన్‌లాల్ త్రయం ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారో చూడాలి!