బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో తెలుగు బుల్లితెర నటి రీతు చౌదరి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, బైక్ రైడర్ భయ్యా సన్నీ యాదవ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ వ్యవహారంలో మంగళవారం (23 డిసెంబర్ 2025న) వీరిద్దరినీ సీఐడీ అధికారులు సుదీర్ఘంగా విచారించడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.
దాదాపు రెండు గంటలకు పైగా అధికారులు వీరిద్దరినీ విడివిడిగా మరియు కలిపి ప్రశ్నించినట్లు సమాచారం. ప్రధానంగా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయడం వెనుక ఉన్న ఆర్థిక లావాదేవీలపై అధికారులు ఆరా తీశారు. ఇందుకు సంబంధించిన విలువైన సమాచారాన్ని C.I.D. రికార్డు చేసినట్లుగా తెలుస్తోంది.
ప్రధానాంశాలు ఇవే:
ప్రమోషన్ల వెనుక ఎవరున్నారు?
బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులతో ఎలా పరిచయం ఏర్పడింది?
మధ్యవర్తులు ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో విచారణ సాగినట్లుగా సమాచారం.
ఆర్థిక లావాదేవీలు:
ఈ యాప్స్‌ను ప్రమోట్ చేసినందుకు గానూ వీరు ఎంత మొత్తంలో పారితోషికం తీసుకున్నారు?
ఆ డబ్బును బ్యాంక్ ఖాతాల ద్వారా తీసుకున్నారా లేక నగదు రూపంలోనా? అన్న విషయాలను అధికారులు పరిశీలించారు.
యూత్ ప్రభావం:
లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్న వీరు, యువతను పెడదోవ పట్టించేలా ఇలాంటి ప్రమాదకరమైన యాప్స్‌ను ఎందుకు ప్రోత్సహించారని సీఐడీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కాసులకు కక్కుర్తిపడి అమాయకుల ప్రాణాలను తీస్తామంటే నడవదని ఇటీవలే హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ సైతం హెచ్చరించారు.
►ALSO READ | Mahesh Babu: యుద్ధవిద్య ‘కళరిపయట్టు’ నేర్చుకున్న మహేష్ బాబు.. కీలక విషయాలు వెల్లడించిన ట్రైనర్
గత కొన్ని రోజులుగా బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసుపై నిఘా ఉంచారు పోలీసులు. ఇప్పటికే విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, యాంకర్ విష్ణు ప్రియ, సిరి హనుమంతు, హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి విచారణ చేసింది సిట్ సిఐడి.
సన్నీ యాదవ్, రీతూ చౌదరి..
దేశ విదేశాల్లో బైక్ రైడింగ్ చేస్తూ పాపులారిటీ సంపాదించుకున్నారు భయ్యా సన్నీ యాదవ్. బుల్లితెర గ్లామరస్ బ్యూటీగా, బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ గా రీతూ చౌదరి మంచి ఫేమ్ సొంతం చేసుకుంది.
అయితే ఈ కేసులో 2025 మార్చిలోనే వీరిద్దరూ విచారణ ఎదుర్కొన్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే.. రీతూ చౌదరి ఈ కేసుకు సంబధించి ఓ వీడియో రిలీజ్ చేయడం, తనపై కేసు నేమోదైందని తెలిసిన వెంటనే.. సే నో టు బెట్టింగ్ యాప్స్ (say no to betting apps) అంటూ ఒక వీడియోలో మాట్లాడింది.
తెలిసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశానని, అవన్నీ గతేడాది చేసినవి అని వీడియో రిలీజ్ చేసింది. బెట్టింగ్ యాప్స్ ను నమ్మకండి.. అంటూ వీడియో చేసింది రీతు చౌదరి. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. ఎందరో అమాయకుల జీవితాలు బెట్టింగ్ యాప్స్ కు బలయ్యాయి. విచారణ ఎదుర్కోక తప్పదు. క్షమాపణ చెబితే తప్పు ఒప్పై పోదుగా అంటున్నారు విశ్లేషకులు. పోలీసులు కూడా ఈ కేసులో చాలా సీరియస్ గా ఉన్నారు.
